జుట్టుకు రంగు వేసుకున్న తర్వాత నూనె పెట్టొచ్చా? లేదా? అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. కానీ దీనికి సరైన సమాధానం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అసలు హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ రోజుల్లో చాలా మంది హెయిర్ కలర్ ను వాడుతున్నారు. కొంతమంది తెల్ల వెంట్రుకలను దాచుకోవడానికి హెయిర్ కలర్ ను వాడితే.. మరికొంతమంది హెయిర్ అందం కోసం వాడుతుంటారు. ముఖ్యంగా హెయిర్ కలర్ ను ఎక్కువగా అమ్మాయిలే వాడుతుంటారు. అయితే ఈ హెయిర్ కలర్ ను వేసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోకపోతే కలర్ తొందరగా పోతుంది. అందుకే హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా? అనేదానిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
24
హెయిర్ కలర్ వేసుకున్న తర్వాత జుట్టుకు నూనె పెట్టొచ్చా?
ప్రతి ఒక్కరి జుట్టుకు తేమ ఖచ్చితంగా అవసరం. అలాగని అన్నిరకాల నూనెను ఉపయోగించకూడదు. ఎందుకంటే మన జుట్టుకు మంచి పోషణను ఇచ్చే నూనెలు ఎన్నో ఉన్నాయి. కానీ హెయిర్ కలర్ కు సరిపోవని నిపుణులు అంటున్నారు. అందుకే మీరు నిపుణుల అభిప్రాయం తీసుకుని తేలికపాటి నూనెను జుట్టుకు పెట్టడం మంచిది. ఇలాంటి నూనె మీ హెయిర్ కలర్ ను పాడు చేయదు. అలాగే కలర్ ఎక్కువ రోజులు జుట్టుకు పట్టే ఉంటుంది.
34
జుట్టుకు ఎప్పుడు నూనెను పెట్టాలి?
మీ జుట్టుకు కలర్ ను వేసుకుని ఉంటే.. కనీసం 48 నుంచి 72 గంటలు నూనె పెట్టకుండా ఉండాలి. ఎందుకంటే ఈ హెయిర్ కలర్ మీ జుట్టుకు సెట్ కావడానికి కాస్త సమయం పడుతుంది. ఈ సమయంలోనే మీరు జుట్టుకు నూనె పెడితే వెంట్రుకలకు కలర్ సరిగ్గా పట్టదు. అందుకే కొంచెం టైం తర్వాతే జుట్టుకు నూనెను పెట్టండి. దీనివల్ల మీ జుట్టు అందంగా కనిపిస్తుంది.
44
రోజూ నూనె పెట్టకూడదు
చాలా మంది ప్రతిరోజూ జుట్టుకు నూనెను పెడుతుంటారు. అలాగే మరికొంతమంది వారానికి 2 నుంచి 3 సార్లు జుట్టుకు నూనెను పెడుతుంటారు. కానీ దీనివల్ల మీ జుట్టు దెబ్బతింటుంది. ఇలా తరచుగా మీ జుట్టుకు నూనె పెడితే ఆయిలీగా మారుతుంది. అందుకే జుట్టుకు తరచుగా నూనె పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల హెయిర్ కలర్ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల జుట్టుకు రంగు ఎక్కువ రోజులు ఉండదు.