వానాకాలంలో సొరకాయను తింటే ఏమౌతుంది?

Published : Aug 12, 2025, 11:27 AM IST

సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని వానాకాలంలో తింటే జలుబు చేస్తుందని తినకుండా ఉంటారు. కానీ వర్షాకాలంలో సొరకాయను తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
15
సొరకాయ

వర్షాకాలంలో చాలా మంది ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. ముఖ్యంగా ఈ సీజన్ లో ఆకు కూరలతో పాటుగా కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉంటుంటారు. ఇలాంటి వాటిలో సొరకాయ కూడా ఉంటుంది. చాలా మంది ఈ సీజన్ లో సొరకాయను తినకుండా ఉంటారు. ఎందుకంటే దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జలుబు అయ్యేలా చేస్తుందని అంటుంటారు. కానీ వర్షాకాలంలో కూడా సొరకాయను తినొచ్చు. ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అసలు వర్షాకాలంలో సొరకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
వర్షాకాలంలో సొరకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండె ఆరోగ్యంగా ఉంటుంది

సొరకాయ గుండె ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వర్షాకాలంలో సొరకాయను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కూరగాయలో మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

35
జుట్టు,చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది

వర్షాకాలంలో సొరకాయను తింటే చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. నిపుణుల ప్రకారం.. మీ జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు ఈ వానాకాలంలో సొరకాయను తినొచ్చు. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.

45
జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది

వానాకాలంలో చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి వారికి సొరకాయ మంచి మేలు చేస్తుంది. నిపుణుల ప్రకారం.. వానాకాలంలో సొరకాయను తింటే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దీనిలో పుష్కలంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గుతారు

సొరకాయను మీరు బరువు తగ్గడానికి కూడా తినొచ్చు. మీరు వానాకాలంలో బరువు తగ్గాలనుకుంటే సొరకాయను ఖచ్చితంగా తినండి. ఈ కూరగాయలో కేలరీలు తక్కువగా, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మీరు సులువుగా బరువు తగ్గుతారు.

55
వాపు తగ్గుతుంది

శరీర వాపును తగ్గించడానికి కూడా సొరకాయ బాగా సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చని కూరగాయలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయి.

షుగర్ కంట్రోల్ అవుతుంది

డయాబెటీస్ పేషెంట్లకు సొరకాయ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరికైనా షుగర్ సమస్య ఉంటే మీరు వర్షాకాలంలో సొరకాయను తినొచ్చు. ఈ కూరగాయ బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories