నార్మల్ గా మనం ఇడ్లీ తయారు చేసుకోవడానికి.. మినపప్పు, ఇడ్లీ రవ్వ లేదంటే..బియ్యం వాడతారు. ఇప్పుడు.. ఈ తెల్ల ఇడ్లీలకు బదులు.. ఎరుపు రంగు ఇడ్లీలు తినడం మొదలుపెడితే.. కచ్చితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తెల్లటి మల్లెపువ్వు లాంటి ఇడ్లీలు చూడటానికి ఎంత బాగుంటాయి. ఆ ఇడ్లీలు వేడి వేడిగా నెయ్యి, కారప్పొడి, చట్నీ చేర్చి తింటే.. రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. అయితే.. ఈ తెల్లటి ఇడ్లీలు ఎప్పటికైనా మన ఆరోగ్యాన్ని ముంచేస్తాయి. ఇడ్లీలు అనే కాదు... మనం ఎప్పటి నుంచి అయితే.. తెల్ల బియ్యం తినడం మొదలుపెట్టామో... ఆ రోజు నుంచి మనకంటూ మనమే ఆరోగ్య సమస్యలు తెచ్చి పెట్టుకోవడం మొదలు పెట్టాం అని చెప్పాలి. గతంలో మన తాత ముత్తాతలు.. జొన్న, సజ్జలు, ఉలవలు వంటి చిరు ధాన్యాలతో చేసిన ఆహారమే తినేవారు. అందుకే 70 ఏళ్లు దాటినా కూడా ఆరోగ్యంగా ఉండేవారు. ఈ కాలంలో 30 ఏళ్లు దాటే సరికి కాళ్ల నొప్పులు రావడం, షుగర్, బీపీ లాంటివి వచ్చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వైట్ రైస్ కి బదులు..జొన్నలు,సజ్జలు, మిల్లెట్స్ తినమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. కానీ.. మొదట ఇడ్లీ నుంచి ఆ మార్పులు చేసుకుంటే.. మనల్ని మనం ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
24
రెడ్ ఇడ్లీ..
నార్మల్ గా మనం ఇడ్లీ తయారు చేసుకోవడానికి.. మినపప్పు, ఇడ్లీ రవ్వ లేదంటే..బియ్యం వాడతారు. ఇప్పుడు.. ఈ తెల్ల ఇడ్లీలకు బదులు.. ఎరుపు రంగు ఇడ్లీలు తినడం మొదలుపెడితే.. కచ్చితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరి, ఈ రెడ్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం....
34
రెడ్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సినవి...`
మాపిలై సాంబా బియ్యం-6 కప్పులు
బియ్యం లేదా ఇడ్లీ రవ్వ-2 కప్పులు
మినపప్పు-1 కప్పు
మెంతులు కొద్దిగా..
రెడ్ ఇడ్లీ తయారీ విధానం...
సాధారణంగా ఇడ్లీకి పిండి రుబ్బినట్లుగా, మినపప్పు, మెంతులను కలిపి కనీసం 2 గంటలు నానపెట్టాలి. ఇప్పుడు మాపిలై సాంబా బియ్యం( తమిళనాడులో దొరికే ఫేమస్ బియ్యం.. రెడ్ రైస్ లా ఉంటుంది చూడటానికి), నార్మల్ బియ్యం రెండింటినీ కనీసం 5 గంటల పాటు నీటిలో నానపెట్టాలి. నానపెట్టిన తర్వాత..మినపప్పు, మెంతులను మంచిగా రుబ్బుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలి. మీరు 5 గంటల కంటే ఎక్కువసేపు ఈ రెడ్ రైస్.. నానబెట్టినా, రుబ్బుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. కొద్ది కొద్దిగా రుబ్బుకోవాలి. మొత్తం బాగా కలిపి కొద్దిగా ఉప్పు వేసి.. రాత్రంతా అలానే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే.. ఈ పిండితో ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
మాప్పిళ్ళై సాంబా బియ్యం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు...
మాప్పిళ్ళై సాంబా బియ్యంలో లైకోపీన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది, ఇది దాని ఎరుపు రంగును ఇస్తుంది. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అవసరమైన శక్తిని పొందడానికి సహాయపడుతుంది. రోజంతా తాజాగా ఉండటానికి సహాయపడుతుంది. నీరసం లేకుండా.. ఉత్సాహంగా ఉంటారు. ఈ బియ్యాన్ని తమిళనాడులో కొత్తగా పెళ్లైన అబ్బాయిలకు పెడుతూ ఉంటారు. వారికి శక్తి అవసరం అని ఈ బియ్యం పెట్టడం వారి ఆచారం.