ప్రెషర్ కుక్కర్‌లో ఈ కూరలు టేస్టీగా అవుతాయి

Published : Aug 29, 2025, 05:45 PM IST

ఈ రోజుల్లో అందరి ఇళ్లలో ప్రెషర్ కుక్కర్ లు ఉన్నాయి. అయితే వీటిని ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉపయోగిస్తుంటారు. కానీ ప్రెషర్ కుక్కర్ లో కొన్ని రకాల వంటలు టేస్టీగా అవుతాయి. 

PREV
15
ప్రెషర్ కుక్కర్

ప్రెషర్ కుక్కర్ లో ఏ వంటైనా సరే చాలా ఫాస్ట్ గా అవుతుంది. అందుకే మటన్, బోటీ, తలకాయ వంటి కూరలను ఈ ప్రెషర్ కుక్కర్ లోనే వండేస్తుంటారు. అలాగే కొంతమంది పప్పును కూడా కుక్కర్ లోనే వండుతుంటారు. ఇవే కాకుండా ప్రెషర్ కుక్కర్ లో కొన్ని రకాల వంటలను కూడా చేయొచ్చు. ఇవి చాలా టేస్టీగా అవుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అందుకే ప్రెషర్ కుక్కర్ లో ఏయే వంటలను చేస్తే టేస్టీగా అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
బీన్స్, పప్పులు

కందిపప్పు, శెనగపప్పు, బీన్స్ వంటివి ఉడకడానికి చాలా సమయం పడుతుంది. వీటిని గ్యాస్ స్టవ్ పై ఉడికిస్తే 40 నిమిషాలకు పైనే పడుతుంది. కానీ మీరు వీటిని ప్రెషర్ కుక్కర్ లో చాలా ఫాస్ట్ గా ఉడికించొచ్చు. పప్పు చారును ప్రెషర్ కుక్కర్ లో చేస్తే టేస్టీగా అవుతుంది. తొందరగా అవుతుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుంది.

35
సూప్‌లు

సూప్ లను చాలా మంది తాగుతుంటారు. అయితే ఈ సూప్ లను మీరు ప్రెషర్ కుక్కర్ లో కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ రకరకాల పదార్థాలను సమానంగా, తొందరగా ఉడికించడానికి సహాయపడుతుంది. టమాటా సూప్ వంటి వాటిని మీరు కొన్ని నాలుగైదు నిమిషాల్లో కుక్కర్ లో చేసేయొచ్చు. దీనిలో చేయడం వల్ల వీటిలోని పోషకాలు కూడా ఎక్కడకూ పోవు.

45
స్టాక్స్ , బ్రోత్స్

స్టాక్స్, బ్రోత్స్ ను తయారుచేయడానికి ప్రెషర్ కుక్కర్లే బెస్ట్. ఎందుకంటే ఇవి ఎముకల్ని, కూరగాయల్ని బాగా ఉడికిస్తాయి. అలాగే వీటి నుంచి పోషకాలను బాగా అందేలా చేస్తాయి. ముఖ్యంగా వీటిని ప్రెషర్ కుక్కర్లో తయారుచేయడం వల్ల టేస్టీగా అవుతాయి.

మాంసం

మాంసాన్ని, గట్టి ముక్కల్ని ఉడికించడానికి ప్రెషర్ కుక్కరే మంచిది. ప్రెషర్ కుక్కర్ లో షార్ట్ రిబ్స్, పాట్ రోస్ట్, షార్ట్ రిబ్స్ లేదా లాంబ్ షాంక్స్ వంటి గట్టి మాంసం ముక్కలు తొందరగా ఉడుకుతాయి. ముక్కలు మొత్తగా ఉుకుతాయి. అందుకే వీటిని ప్రెషర్ కుక్కర్ లోనే ఉడికించాలి.

55
రూట్ కూరగాయలు

రూట్ కూరగాయల్ని ప్రెషర్ కుక్కర్ లోనే వండాలి. ఆలుగడ్డలు, క్యారెట్లు, చిలగడదుంపలు వంటి రూట్ వంటల్ని వండటానికి ప్రెషర్ కుక్కర్లే బెస్ట్. ప్రెషర్ కుక్కర్ లోని అధిక పీడనం వల్ల కూరగాయలు తొందరగా మెత్తగా ఉడుకుతాయి. ప్రెషర్ కుక్కర్ వీటిని తొందరగా గుజ్జు చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories