Milk: ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

Published : Feb 07, 2025, 04:39 PM IST

మనలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే చేసే పనుల్లో పాలు తాగడం ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉదయం లేవగానే పాలు తాగుతారు. అయితే ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదేనా.? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
Milk: ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

ఖాళీ కడుపుతో పాలు, పెరుగు వంటివి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. పాల ఉత్పత్తుల్లో నేచురల్‌ లాక్టిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులో ఆమ్లం పెరగడానికి దారి తీస్తుంది. దీంతో అపానవాయుడు, కడుపుబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారి తీస్తుంది. ఇంతకీ ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. 

24

పెరుగు తింటే.. 

అయితే ఎట్టి పరిస్థితుల్లో పెరుగును మాత్రం ఖాళీ కడుపుతో తీసుకోకూడదని అంటున్నారు. పడగడుపు పెరుగును తీసుకుంటే కడుపులో ఉండే ఆమ్లం పెరుగులో ఉండే కొన్ని ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను చంపుతుంది. దీని కారణంగా దాని ప్రోబయోటిక్ ప్రయోజనాలు తగ్గుతాయి. పెరుగు తిన్నా ప్రయోజనం ఉండదు. అయితే పెరుగును ఓట్స్ లేదా పండ్లతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కొందరిలో ఖాళీ కడుపుతో పెరుగు తీసుకుంటే అసిడిటీ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి. యాసిడ్‌ రిప్టక్స్‌ సమస్యతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పెరుగులోకి లాక్టిక్‌ ఆమ్లం కడుపులో ఉబ్బరం లేదా అసౌకర్యానికి దారి తీస్తుంది. 
 

34
sesame seed milk

పాలు తాగొచ్చా.? 

పాలను కూడా పడగడుపున తీసుకోవడం మంచిది కాదు. కొంత మందికి పాలలోని లాక్టోజ్‌ జీర్ణం కావడం ఇబ్బందిగా మారుతుంది. దీంతో గ్యాస్‌, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. పాలలోని లాక్టోజ్‌ సరిగ్గా జీర్ణంకాకపోవడం వల్ల విరేచననాలు, కడుపు నొప్పికి దారి తీసే అవకాశం ఉంటుంది. ఖాళీ కడుపుతో పాలు తాగితే గ్యాస్ట్రిక్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 

ఇది కూడా చదవండి: 365 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, నెలకు కేవలం..

44

ఎప్పుడు తాగితే మంచిది.? 

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకుండా టిఫిన్‌ చేసిన తర్వాత పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక రాత్రి పడుకునే ముందు పాలు తాగితే మరింత ప్రయోజనం జరుగుతుంది. పాలలో చిటికెడు పసుపు లేదా దాల్చిన చెక్క పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానికి మేలు జరగడంతో పాటు మంచి నిద్ర సొంతమవుతుందని అంటున్నారు. ఇక పెరుగు కూడా మధ్యాహ్నం భోజనం తీసుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు రాత్రుళ్లు పెరుగును తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు. 

గమనిక: ఈ వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

ఇవి కూడా చదవండి:  తొలి రెండు సినిమాలతోనే రూ. 1500 కోట్లు కొల్లగొట్టింది.. కుంభమేళలో సందడి చేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా.?

Read more Photos on
click me!

Recommended Stories