Raw Chicken: పచ్చి చికెన్ ఎన్ని రోజులు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవచ్చు..?

Published : Nov 22, 2025, 12:20 PM IST

Raw Chicken:  చికెన్ ని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా?  వండిన చికెన్ ని కాకుండా… పచ్చి చికెన్ ని ఎన్ని రోజులు ఫ్రిజ్ లో నిల్వ చేాయాలో తెలుసా? అసలు చికెన్ తాజాగా ఉందో లేదో ఎలా గుర్తించాలో తెలుసా?

PREV
14
Raw Chicken

ఫ్రిజ్ ఉంది కదా అని చాలా మంది ఉడికించని చికెన్ తెచ్చి... ఎక్కువ రోజులు నిల్వ చేస్తూ ఉంటారు. ఇది చాలా మంది కామన్ గా చేసే తప్పే. ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని స్టోర్ చేస్తూ ఉంటారు. కానీ, అసలు ఫ్రిజ్ లో చికెన్ ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు.? ఎన్ని రోజులు తాజాగా ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం....

24
ఫ్రిజ్ లో చికెన్ పాడౌతుందా.. లేదా?

ఫ్రిజ్ లో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా చల్లగా ఉండటం వల్ల ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వవు అనుకుంటాం. కానీ, ఫ్రిజ్ లో కూడా బాక్టీరియా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, ఉడికించని పచ్చి చికెన్ కేవలం రెండు మూడు రోజులు మాత్రమే తాజాగా ఉండగలదు అని నిపుణులు చెబుతున్నారు.

34
ఫ్రిజ్ ఉష్ణోగ్రత చికెన్ ని ఎలా ప్రభావితం చేస్తుంది...?

రిఫ్రిజిరేషన్ చెడిపోయే బాక్టీరియాను ఆపదు. అది కేవలం నెమ్మదిస్తుంది. అంటే.. ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రత 4°C కంటే ఎక్కువగా పెరిగినా, రెగ్యులర్ గా తలుపులు తెరిచినా, ఫ్రిజ్ పూర్తిగా లోడ్ అయినా... పచ్చి చికెన్ త్వరగా చెడిపోతుంది. కొద్దిసేపు ఫ్రిజ్ తలుపులు తెరిచి ఉంచినా బాక్టీరియా పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

44
ఎలా స్టోర్ చేయాలి..?

పచ్చి చికెన్ ని మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేయాలి అనుకుంటే... కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే నిల్వ చేయగలరు. అలా కాదు... మీరు ఎక్కువ రోజులు నిల్వ చేయాలి అనుకుంటే.... కచ్చితంగా డీప్ ఫ్రిజ్ లో పెట్టాలి. పూర్తిగా గట్టకట్టేలా స్టోర్ చేసినప్పుడు చికెన్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

పచ్చి చికెన్ పాడైపోయిందని గుర్తించేదెలా?

చికెన్ చెడిపోయిందో లేదో మనం కొన్ని లక్షణాల ఆధారంగా తెలుసుకోవచ్చు. దాని నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అంతేకాదు... చికెన్ చాలా జిగురుగా తయారౌతుంది. కొన్నిసార్లు బూజు కూడా పట్టొచ్చు. అలాంటి స్థితిలో ఉన్న చికెన్ తినడం మంచిది కాదు.

Read more Photos on
click me!

Recommended Stories