ఆరోగ్యాన్ని ఎవరైనా కాదు అనుకుంటారా? బతికినంత కాలం ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటే చాలు అనే అనుకుంటారు. అయితే.. అలా ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం, మంచి లైఫ్ స్టైల్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. దీని కోసం ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రోటీన్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గింజలను డైట్ లో భాగం చేసుకోవాలి. అంతేనా... వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదు. శుద్ధి చేసిన నూనె, చెక్కర ఎక్కువగా ఉండే ఆహారాలు, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం కూడా మానుకోవాలి. వీటితో పాటు రెగ్యులర్ గా 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. వీటన్నింటినీ ఫాలో అవుతూనే.. ప్రతిరోజూ పడుకునే ముందు గ్లాసు పాలలో కొద్దిగా నెయ్యి వేసుకొని తాగాలట. అలా చేయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయట. మరి, ఆ ప్రయోజనాలేంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం..