Chicken: రోజూ చికెన్ తింటున్నారా? అయితే వీటిని కచ్చితంగా తెలుసుకోండి!

Published : Jun 09, 2025, 06:05 PM IST

చికెన్ ని చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు వారానికి ఒకసారి తింటే మరికొందరు రోజూ తింటారు. అయితే చికెన్ ని రోజూ తినడం వల్ల కలిగే లాభనష్టాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
రోజూ చికెన్ తింటే ఏమవుతుంది?

చికెన్ ని ఇష్టపడని వారుండరు. ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ వెరైటీస్ ఉండాల్సిందే. కొందరు వారాలతో సంబంధం లేకుండా చికెన్ తింటారు. మరికొందరు రోజూ తినడానికి ఇష్టపడతారు. కానీ రోజూ చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదా.. కాదా.. అనే సందేహం చాలామందిలో ఉంటుంది. రోజూ చికెన్ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. 

24
జీర్ణ సమస్యలు

చికెన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. సాధారణంగా చికెన్ ని వారానికి ఒకటి, రెండుసార్లు తినడం ఆరోగ్యానికి మంచిదే. కానీ అదేపనిగా రోజూ తినడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. చికెన్ అధికంగా తింటే శరీరంలో ప్రోటీన్ల మోతాదు పెరిగిపోతుంది. దీనివల్ల చాలారకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. రోజూ చికెన్ తింటే జీర్ణ సమస్యలు తీవ్రమవుతాయి. జీర్ణశక్తి తగ్గిపోతుంది. మలబద్ధకం సమస్య పెరుగుతుంది. మలబద్ధకం ఉన్నవారు రోజూ చికెన్ తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

34
కొలెస్ట్రాల్ పెరుగుతుంది

ఓ అధ్యయనం ప్రకారం రోజూ చికెన్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. చికెన్‌లో ప్రోటీన్‌తో పాటు కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి రోజూ చికెన్ తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు రోజూ చికెన్ తింటే గుండెల్లో మంట, యాసిడిటీ వంటి సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందట. 

44
ఎంత తినాలంటే?

బ్రాయిలర్ చికెన్‌లో సాల్మొనెల్లా అనే బాక్టీరియా ఉంటుంది. చికెన్ ని ఎక్కువగా తినడం వల్ల ఈ బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి.. కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి రోజూ చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రాయిలర్ చికెన్‌కు బదులుగా నాటు కోడి మాంసం తినడం మంచిదంటున్నారు. రోజూ చికెన్ తినాల్సి వస్తే 100 గ్రాములకంటే ఎక్కువ తినకూడదని సూచిస్తున్నారు.   

Read more Photos on
click me!

Recommended Stories