Anemia: ఇటీవల రక్తహీనతతో చాలా మంది బాధపడేవారు. శరీరంలో సరైన స్థాయిలో రక్తం ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. రక్తహీనత ఉంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, విపరీతమైన అలసట, లేత చర్మం, జుట్టు రాలడం, గుండె కొట్టుకోవడం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి తీసుకోవాల్సిన ఆహారపదార్థాలు ఇవే.
శరీరంలో సరైన స్థాయిలో రక్తం ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఈ సమస్యనే రక్తహీనత అంటారు. అంటే.. ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గినప్పుడు శరీరంలో రక్తహీనత ఏర్పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఎక్కువ. రక్తహీనత సమస్యను అధిగమించడానికి ఏ ఆహారాలు తీసుకోవాలో తెలుసుకుందాం..
25
దానిమ్మ
రక్తహీనత సమస్యకు దానిమ్మ చెక్ పెడుతుంది. దానిమ్మలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరంలో రక్తహీనత రాకుండా చేస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ దానిమ్మ తినడం ఉత్తమం.
35
బీట్రూట్
రక్తహీనతను దూరం చేయడానికి బీట్రూట్ బెస్ట్. రక్తహీనతతో బాధపడుతున్న వారికి బీట్రూట్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఇనుముతో పాటు ఫైబర్, కాల్షియం, పొటాషియం, సల్ఫర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తహీనతకు చెక్ పెడుతాయి.
ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని డైలీ తిన్నడం వల్ల రక్తహీనత సమస్య కు చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి పాలతో ఖర్జూరం తీసుకోండి ఉత్తమం.
55
మెంతులు
రక్తహీనతను దూరం చేయడానికి మెంతులను కూడా తీసుకోవచ్చు. వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. మెంతి ఆకు, గింజలు రెండింటినీ తీసుకోవడం ప్రయోజకరమే.