Food

రోజుకు రెండు ఖర్జూరాలు తిన్నారంటే ఏం జరుగుతుందో తెలుసా?

Image credits: Getty

మలబద్ధకం

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజుకు రెండు ఖర్జూరాలను తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. 

Image credits: Getty

రక్తహీనత

ఖర్జూరాలు శరీరంలో రక్తాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలో ఇనుమును పెంచి రక్తహీనతను తగ్గిస్తాయి. 

Image credits: Getty

ఎముకల ఆరోగ్యం

ఖర్జూరాల్లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఎముకల్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

గుండె ఆరోగ్యం

రోజుకు రెండు ఖర్జూరాలను తింటే మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లు రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

Image credits: Getty

రోగనిరోధక శక్తి

రోజుకు రెండు ఖర్జూరాలను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Image credits: Getty

చర్మ ఆరోగ్యం

రోజుకు రెండు ఖర్జూరాలను తిన్న వారి చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది. ఖర్జూరాల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని హెల్తీగా ఉంచుతాయి. 

Image credits: Getty

జ్వరం వచ్చినప్పుడు చికెన్‌ తినొచ్చా.. తింటే ఏమవుతుంది.?

చలికాలంలో నల్ల నువ్వుల లడ్డు ఒక్కటి తిన్నా చాలు

రోజూ ఒక గుడ్డును ఖచ్చితంగా తినాలా?

ఓట్స్ ను రోజూ తినొచ్చా? తింటే ఏమౌతుంది?