Banana: అరటిపండ్లను ఉదయం తినాలా? లేకపోతే రాత్రి తినాలా?

Published : Sep 21, 2025, 01:35 PM IST

Banana: అరటిపండ్లు ఏ కాలమైనా మనకు మార్కెట్ లో దొరుకుతాయి. అందులోనూ ఈ పండ్లు ఇతర పండ్లకంటే తక్కువ రేటుకే లభిస్తాయి. కానీ వీటిలో మన ఆరోగ్యానికి మేలుచేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లను ఏ టైంలో తినాలో తెలుసా?

PREV
15
అరటిపండ్లు

అరటిపండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లను తినడం వల్ల శరీరానికి మంచి శక్తి అందడం నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు. మరి ఇలాంటి అరటిపండ్లను ఏ టైంలో తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
వ్యాయామానికి ముందు

వర్కౌట్స్ చేసేవారికి శక్తి ఎక్కువగా అవసరమవుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఉదయాన్నే వర్కౌట్ చేయడానికి ముందే తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండును తినడం వల్ల శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. అలాగే ఇవి చాలా తొందరగానూ జీర్ణం అవుతాయి.

35
బ్రేక్ ఫాస్ట్ లో

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండును తినడం కూడా మంచిదే. దీనివల్ల కడుపు తొందరగా నిండుతుంది. అలాగే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీనివల్ల మీరు హెవీగా తినకుండా ఉంటారు. అలాగే మీరు మధ్యాహ్నం బలహీనంగా ఉన్నట్టైతే అప్పుడు కూడా తినొచ్చు.

అరటిపండ్లలో విటమిన్ బి6, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి జీవక్రియను పెంచడానికి, ఇమ్యూనిటీ పవర్ ను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. భోజనానికి అర్థగంట ముందు అరటిని తింటే మీకు ఎక్కువ ఆకలి కాకుండా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

45
జీర్ణక్రియకు

మీరు ఏ టైంలో తిన్నా జీర్ణక్రియకు ఎలాంటి సమస్య రాదు. అయితే వీటిని భోజనంతో పాటుగా తింటే మాత్రం ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది పేగుల్లో మలం సులువుగా కదలడానికి సహాయపడుతుంది. కాబట్టి మలబద్దకం సమస్యను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

సాయత్రం పూట

సాయంత్రం వేళల్లో అరటిపండును చిరుతిండిగా తినొచ్చు. ఇది మీరు రాత్రిపూట ప్రశాంతంగా పడుకోవడానికి సహాయపడుతుంది. దీనిలో మెగ్నీషియం,పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి మీరు రాత్రిళ్లు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

55
అరటిపండ్లను ఎప్పుడు తినకూడదు

ఆయుర్వేదం ప్రకారం.. రాత్రిపూట పడుకునే ముందు అరటిపండ్లను తినకూడదు. ఎందుకంటే దీనివల్ల శ్లేష్మం ఏర్పడుతుంది. దీంతో జీర్ణక్రియ మందగిస్తుందని నమ్ముతారు. అలాగే నైట్ అరటిపండ్లనను తింటే రాత్రి మీరు సరిగ్గా నిద్రపోలేరు. ఇవి మీ నిద్రకు భంగం కలిగిస్తాయని నమ్ముతారు. అంతేకాదు పరిగడుపున కూడా అరటిపండ్లను తినకూడదని చెప్తారు. దీనివల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పరిగడుపున అరటిని వేరే ఆహారాలతో కలిపి తినడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories