పరిగడుపున నానబెట్టిన ఖర్జూరాలను తింటే ఎంత మంచిదో

Published : Sep 21, 2025, 01:07 PM IST

Soaked Dates: ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఖర్జూరాలను నానబెట్టి ఉదయం పరిగడుపున తినడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

PREV
18
ఖర్జూరాలు

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ముఖ్యంగా ఖర్జూరాలను నానబెట్టి తినడం ఇంకా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పరిగడుపున నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

28
జీర్ణక్రియను సులభతరం చేస్తుంది

ఉదయం పరిగడుపున నానబెట్టిన ఖర్జూరాలను తినడం జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అలాగే పోషకాలను మన శరీరం బాగా గ్రహించేలా చేయడానికి కూడా సహాయపడుతుంది. 

38
మలబద్ధకాన్ని నివారిస్తుంది

మలబద్దకం సమస్య ఉన్నవారికి కూడా నానబెట్టిన ఖర్జూరాలు బాగా సహాయపడతాయి. ఈ ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడుతుంది. మీరు గనుక ఖర్జూరాలను నానబెట్టి తింటే తిన్నది సులభంగా జీర్ణం అవుతుంది. 

48
శక్తిని అందిస్తుంది

ఖర్జూరాలు మంచి శక్తి వనరులు. వీటిలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నానబెట్టిన ఖర్జూరాలను తింటే మీ శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. 

58
రక్తపోటును నియంత్రిస్తుంది

ఖర్జూరాలు రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

68
మెదడును రక్షిస్తుంది

ఖర్జూరాల్లో విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడటానికి సహాయపడతాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తాయి.

78
రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఖర్జూరాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. మీరు పరిగడుపున నానబెట్టిన ఖర్జూరాలను తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీనిలో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఎముకల్ని బలంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి.

88
ఖర్జూరాలను ఎలా నానబెట్టాలి?

ఖర్జూరాలను రాత్రంతా గ్లాస్ నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే వీటిని పరిగడుపున తినండి. నీళ్లలో కాకుండా ఖర్జూరాలను పాలలో నానబెట్టి కూడా తినొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories