తలుపులు, కిటికీలు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది అయితే వెంటనే ఇలా చేయండి
వర్షాకాలంలోనే కిటికీలు, తలుపులు మూయడానికి, తెరవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే తేమ వల్ల కిటికీలు, తలుపులు బిగుసుకుపోయి ఇలా జరగుతుంది. మరి దీన్ని ఎలా సరిచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కిటికీలు, తలుపులు
వానాకాలం వస్తే చాలు ఎన్నో సమస్యలు చుట్టుకుంటాయి. వీటిలో ఇంటి కిటికీలు, తలుపులు బిగుసుకుపోవడం కూడా ఉంది. దీనివల్ల వీటిని తెరవడానికి, మూయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఉప్పు కాగితం
ఈ ఉప్పు కాగితం కిరాణ షాపుల్లో దొరుకుతుంది. దీన్ని ఉపయోగించి కిటికీలు, తలుపులు సులువుగా కదిలేలా చేయొచ్చు.దీన్ని కిటీకీ, తలుపుల్లో ఎక్కడ బిగుతుగా అయ్యిందో చూసి అక్కడ రుద్దండి. దీంతో అక్కడ వేడెక్కి తేమ తగ్గుతుంది. దీంతో తలుపులు ఎప్పటిలా సులువుగా తెరవొచ్చు. మూయొచ్చు.
హెయిర్ డ్రైయర్
వానాకాలంలో తలుపులను, కిటికీలను మూయడానికి ఇబ్బంది పడితే మీ ఇంట్లోనే హెయిర్ డ్రైయ్యర్ ను ఉపయోగించి సరిచేయండి. ఇందుకోసం ఎక్కడైతే తలుపులు, కిటికీలు ఉబ్బాయో అక్కడ హెయిర్ డ్రైయ్యర్ తో ఆరబెట్టండి. ఇలా చేస్తే కిటికీలు, తలుపులను ఈజీగా తెరవొచ్చు. మూయొచ్చు.
సబ్బు
సబ్బుతో కూడా మీరు కిటికీలను, తలుపులను సరిచేయొచ్చు. మీ ఇంటి తలుపులు, కిటికీలు మూసుకోకపోయినా, సరిగ్గా తెరుచుకోకపోయినా మిగిలిన సబ్బు ముక్కలతో తలుపుల అంచులను బాగా రుద్దండి. ఇలా చేస్తే కిటికీలు కిటికీ, తలుపు సరిగ్గా మూసుకోకపోయినా, తెరుచుకోకపోయినా ఒక సులభమైన మార్గం ఉంది. ఇంట్లో మిగిలి ఉన్న సబ్బు ముక్కతో తలుపు అంచులను బాగా రుద్దాలి. ఇలా చేస్తే తలుపు, కిటికీ సులభంగా తెరుచుకుంటుంది.
పెయింట్
వానాకాలంలో కిటికీలు, తలుపులు బిగుసుకుపోయే మూయడానికి, తెరవడానికి ఇబ్బంది కలిగితే పెయింట్ వేయండి. అందుకే వానాకాలంలో ఖచ్చితంగా తలుపులకు, కిటికీలకు పెయింట్ వేయండి. దీనితో తేమ సమస్య ఉండదు.
ఆముదం
వానాకాలంలో చాలా సార్లు తాళం చెవి ఇరుక్కుపోతుంటుంది. ఈ సమస్య రాకుండా ఉండటానికి ఆముదం బాగా సహాయపడుతుంది. ఇందుకోసం తాళంలో రోజూ కొంచెం ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ ను వేయండి.