Coconut Water: కొబ్బరి నీళ్లు ఏ టైంకి తాగితే మంచిదో తెలుసా?

వేసవిలో శరీర వేడి తగ్గడానికి, హైడ్రేటెడ్ గా ఉండడానికి మనం రకరకాల డ్రింక్స్ తాగుతుంటాం. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఏ టైంలో తాగితే ఇంకా మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

Best Time to Drink Coconut Water in Summer Health Benefits in telugu KVG

వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. దానికోసం రకరకాల డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఎక్కువమంది తాగేది మాత్రం కొబ్బరినీళ్లే. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అమైనో ఆమ్లాలు, పొటాషియం, కాల్షియం, మాంగనీస్ లాంటివి ఉంటాయి. అంతేకాదు కొబ్బరినీళ్లలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు, చక్కెర తక్కువగా ఉంటాయి. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 

Best Time to Drink Coconut Water in Summer Health Benefits in telugu KVG
కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగాలి?

వేసవిలో కొబ్బరి నీళ్లను ఎప్పుడు తాగినా ప్రయోజనం పొందవచ్చని అనుకుంటారు. కానీ అది నిజం కాదట. వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన సమయం ఉదయం. వేసవిలో ఉదయం కొబ్బరి నీళ్లు తాగి రోజును ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. శరీరాన్ని తాజాగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరానికి చాలా అవసరం. ఇంకా ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వేసవిలో వచ్చే అంటు వ్యాధుల నుంచి రక్షించడానికి సహాయపడుతాయి.

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది: 
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటానికి ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.

బరువును అదుపులో: 
కొబ్బరి నీళ్లలో కేలరీలు, చక్కెర తక్కువగా ఉండటం వల్ల బరువును అదుపులో ఉంచడానికి ఇది బాగా సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

వేసవిలో సూర్యరశ్మి, దుమ్ము, కాలుష్యం వల్ల చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు కొబ్బరి నీళ్లు తాగితే అందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఆక్సిజన్ ఎక్కించే గుణాలు ఈ వేసవిలో కూడా మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుతాయి.

శారీరక అలసటను తగ్గిస్తుంది: 
వేసవి వేడిమి వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. దీనికి ముఖ్య కారణం పోషకాహార లోపం. కానీ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా మీరు తాజాగా అనుభూతి చెందవచ్చు.

గర్భిణీలు కొబ్బరి నీళ్లు తాగవచ్చా?

- గర్భిణీలు వేసవి వేడి నుంచి తప్పించుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇంకా ఇది గుండెల్లో మంట, ఉదయం వచ్చే సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. 

- అలాగే మీరు వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

గమనిక: 
మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించిన తర్వాతే కొబ్బరి నీళ్లు తాగాలి.

Latest Videos

vuukle one pixel image
click me!