Kitchen tips: కూరలో నూనె ఎక్కువైతే ఇలా చేయండి!

వంటకాల్లో అన్ని కరెక్టుగా ఉంటేనే రుచి బాగుంటుంది. కానీ ఒక్కోసారి పొరపాటున ఉప్పు, కారం, నూనె లాంటివి ఎక్కువ వేస్తుంటాం. దానివల్ల రుచి చెడిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అయితే కూరల్లో నూనె ఎక్కువ అయినప్పుడు కొన్ని చిట్కాలు పాటించి దాన్ని తగ్గించవచ్చు. అవెంటో ఇక్కడ చూద్దాం.

Easy Ways to Remove Excess Oil from Your Dish in telugu KVG

కొన్నిసార్లు గ్రేవీ చేసేటప్పుడు కూరలో నూనె ఎక్కువ వేస్తుంటాం. తర్వాత ఏం చేయాలో తెలీదు. కూరలో నూనె తేలుతూ ఉంటుంది. దానివల్ల రుచి కూడా మారుతుంది. చాలామంది ఇలా కూరలో నూనె తేలుతుంటే తినడానికి ఇష్టపడరు. మరి అలాంటి టైంలో ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ చిట్కాలు. ఓసారి చూసేయండి.

Easy Ways to Remove Excess Oil from Your Dish in telugu KVG
బ్రెడ్, చపాతీ

కూరలో నూనె ఎక్కువగా ఉంటే తినడానికి బాగుండదు. కాబట్టి ఆ నూనెలో బ్రెడ్ లేదా చపాతీ వేయండి. అవి నూనెను పీల్చుకుంటాయి. కొన్ని సెకన్ల తర్వాత వాటిని బయటకు తీస్తే సరిపోతుంది.


టిష్యూ పేపర్‌

గ్రేవీ మీద తేలే నూనెను తీసేయడానికి టిష్యూ పేపర్ వాడండి. పైన నెమ్మదిగా వేస్తే, అది నూనెను పీల్చుకుంటుంది. తర్వాత జాగ్రత్తగా దాన్ని తీసేయాలి.

ఐస్ క్యూబ్స్‌

ఒక పెద్ద ఐస్ క్యూబ్‌ను క్లాత్‌లో చుట్టి గ్రేవీలో ముంచండి. చల్లగా ఉండడం వల్ల నూనె గడ్డకట్టడం మొదలవుతుంది. ఐస్‌కు అంటుకుంటుంది. అప్పుడు ఐస్ ను తీసేస్తే సరిపోతుంది.

ఫ్రిజ్‌లో పెట్టడం

కాస్త ఎక్కువ టైమ్ ఉంటే.. నూనె ఎక్కువైన కూరను ఫ్రిజ్‌లో పెట్టండి. తక్కువ టెంపరేచర్ వల్ల నూనె పైకి వస్తుంది. అప్పుడు స్పూన్‌తో ఈజీగా తీసేయవచ్చు.

శనగపిండి

కూరలో నూనె ఎక్కువగా ఉంటే కొంచెం శనగపిండిని వేయండి. ఇది నూనెను పీల్చుకుంటుంది. అంతేకాదు గ్రేవీని చిక్కగా చేస్తుంది. కూరకు మరింత రుచిని పెంచుతుంది.

ఉడికించిన బంగాళాదుంప

గ్రేవీలో ఉడికించిన బంగాళాదుంపను మెదిపి వేస్తే నూనె బ్యాలెన్స్ అవుతుంది. అలాగే పప్పు ఉడికించిన నీళ్లు కూడా నూనె తగ్గించడానికి ఉపయోగించవచ్చు.

ఇవి గుర్తుంచుకోండి

కూరలో నూనె ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల జీర్ణ సమస్యలు వస్తాయంటున్నారు. నూనెను ఎంత తక్కువ వాడితే ఆరోగ్యానికి అంత మంచిదని సూచిస్తున్నారు.

Latest Videos

vuukle one pixel image
click me!