Pomegranate Juice: రోజూ ఉదయం ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే ఏమౌతుంది?
దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి, ఈ తాాజా దానిమ్మ గింజలతో చేసిన జ్యూస్ రోజూ తాగితే ఏమౌతుంది? కలిగే లాభాలేంటో చూద్దాం..
దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మరి, ఈ తాాజా దానిమ్మ గింజలతో చేసిన జ్యూస్ రోజూ తాగితే ఏమౌతుంది? కలిగే లాభాలేంటో చూద్దాం..
వేసవిలో ఎండల వేడి తట్టుకోవడం అంత సులభం కాదు. మన శరీరం డీ హైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. మంచి నీళ్లు ఎన్ని తాగినా దాహం కూడా తీరదు. అందుకే.. ఈ వేసవిలో శరీరాన్ని చల్లబరిచే, శక్తినిచ్చే పానీయాలు తీసుకోవాలి. అలాంటి వాటిలో దానిమ్మ కాయ జ్యూస్ ముందు వరసలో ఉంటుంది. నార్మల్ గా దానిమ్మ గింజలను తింటూ ఉంటాం. అయితే, గింజలు కాకుండా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. అది కూడా ప్రతిరోజూ ఉదయాన్నే ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదట. మరి, ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. అంతేకాకుండా.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ (వాపు) ఉంటే తగ్గించడంలో దానిమ్మ జ్యూస్ సహాయం చేస్తుంది. శరీరంలో వాపు ఉంటే, దానిమ్మ జ్యూస్ తాగితే మంచిది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల రిస్క్ తగ్గిస్తుంది.
2. గుండెను బలంగా చేస్తుంది
దానిమ్మ జ్యూస్ గుండెకు చాలా మంచిది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, బ్లడ్ ప్రెషర్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. ఉదయాన్నే తాగితే గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది.
3. కిడ్నీ ఆరోగ్యానికి వరం
దానిమ్మ జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం తక్కువ. ఇది రక్తం లోని ఆక్సలేట్, కాల్షియం, ఫాస్ఫేట్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది.
4. వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుతుంది
వ్యాయామం చేసేవాళ్లకు దానిమ్మ జ్యూస్ మంచి ఎనర్జీ డ్రింక్. ఇది కండరాల అలసటను తగ్గిస్తుంది, స్టామినాను పెంచుతుంది. జిమ్ కి వెళ్లేవారు ఎనర్జీ డ్రింక్స్ కి బదులు ఈ జ్యూస్ తాగడం ఉత్తమం.
5. మెదడును చురుకుగా చేస్తుంది
దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల రిస్క్ తగ్గిస్తాయి.
6. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
దానిమ్మ జ్యూస్ పేగులోని బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకం, ఎసిడిటీని తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
దానిమ్మ జ్యూస్ ఎలా తాగాలి?
1. దానిమ్మ గింజలు తీసి బ్లెండ్ చేసి, చక్కెర కలపకుండా తాగాలి.
2. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా మంచిది.
3. జ్యూస్‌ను ఎక్కువసేపు నిల్వ చేయకూడదు, వెంటనే తాగాలి.
గుండె, మెదడు, కిడ్నీలకు బెస్ట్..
ఉదయాన్నే ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగితే లోపలి నుంచి బలంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఇది గుండె, మెదడు, కిడ్నీ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.