Ridge Gourd: రోజూ బీరకాయ తింటే ఇంత మంచిదా?

Published : May 01, 2025, 08:00 AM IST

రెగ్యులర్ గా ఈ బీరకాయ తినడం వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడమే కాకుండా, కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.మరి, ఈ బిరకాయను రోజూ తింటే మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

PREV
15
Ridge Gourd: రోజూ బీరకాయ తింటే  ఇంత మంచిదా?
Ridge Gourd

బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల వేడిని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ వేడి తట్టుకోవాలి అంటే రెగ్యులర్ గా మన శరీరాన్ని కూల్ చేసే కూరగాయలు తినాలి. అలాంటి కూరగాయల్లో బీరకాయ ఒకటి. ఈ కూరగాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. దీనిలో కేలరీలు కూడా చాలా తక్కువ. అలా అని పోషకాలు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి. ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, పొటాషియం, సోడియం, రాగి, సెలీనియం వంటివి చాలా ఉన్నాయి. 

రెగ్యులర్ గా ఈ బీరకాయ తినడం వల్ల మన శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడమే కాకుండా, కాలేయ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.మరి, ఈ బిరకాయను రోజూ తింటే మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

25

బీరకాయ ఆరోగ్య ప్రయోజనాలు..
బీరకాయలో బీటా కెరీటిన్ విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ కూరగాయను రెగ్యులర్ గా తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. వృద్ధాప్యంలో చూపు మందగించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కంటిచూపు మెరుగుపరచడమే కాదు, ఇతర కంటి వ్యాధులను కూడా నివారించడంలో సహాయం చేస్తుంది. బీటా కెరోటిన్ ఆప్టిక్ నరాలు, రక్తనాళాల నుంచి టాక్సిన్స్ తొలగిస్తుంది.  తద్వారా అవి కళ్లకు హాని కలిగించకుండా నిరోధిస్తుంది.
 

 

ఉదర సమస్యలను తగ్గిస్తుంది: బీరకాయలో సమృద్ధిగా ఉండే సెల్యులోజ్ ఉదర భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపు నొప్పి, కడుపులో మంట, వికారం వంటి ఉదర సంబంధిత సమస్యలను (Abdominal problems) తగ్గించడంతోపాటు ఫైల్స్ (Files) నివారణలో కూడా అద్భుతంగా సహాయపడుతుంది.
 

35

రక్తహీనతకు పరిష్కారం
ఈ కూరగాయలో అధిక ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల,  క్రమం తప్పకుండా తినేటప్పుడు ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనతను నయం చేయడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్‌లో విటమిన్ B6 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గించే బీరకాయ..
బీరకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. చాలా తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది. దీనిలోని ఇన్సులిన్ లాంటి పెప్టైడ్‌లు,  ఆల్కలాయిడ్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.

45

ridge gourd

మలబద్ధకం నుండి ఉపశమనం కోసం బీరకాయ..
బీరకాయ తినడం వల్ల  మలబద్దకం సమస్యకు పరిష్కారం దొరికినట్లే.  రెగ్యులర్ గా తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

కాలేయ పనితీరు
మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి, జీర్ణం కాని ఆహార కణాల రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యాన్ని బీరకాయ కలిగి ఉంటుంది. అందువల్ల, ఇది కాలేయ ఆరోగ్యంలో, పిత్త పనితీరును పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

మధుమేహ నివారణ
బీరకాయలో కేలరీలు, చక్కెరలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో, దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రించడానికి, ఆకలిని నివారించడానికి, బరువు పెరగకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఇది ఫైటోన్యూట్రియెంట్లలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అకస్మాత్తుగా పెరుగుదలను నిరోధిస్తుంది.

55

ridge gourd

శరీర వేడిని తగ్గిస్తుంది

బీరకాయ ఒక నీటి కూరగాయ. ఇది అదనపు శరీర వేడిని తగ్గిస్తుంది. దీనిలో పొటాషియం, సోడియం, జింక్, రాగి, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో అధిక ఆమ్లతను తగ్గించడంలో సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కళ్ళు, కాలేయం, కడుపు , మూత్రపిండాల ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణాలలో ఒకటి శరీర రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం. బీరకాయలోని విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, థియామిన్, జింక్ ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories