
బొప్పాయి పండు అందరూ తింటారు. చాలా మంది ఫేవరేట్ పండు కూడా ఇది. ఈ పండు తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ.. పచ్చి బొప్పాయి ఎప్పుడైనా తిన్నారా? మీరు చదివింది నిజమే, పచ్చి బొప్పాయి పండు తినడం వల్ల మనకు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా జీర్ణక్రియ, కడుపు ఉబ్బరం, ప్రేగు ఆరోగ్యానికి పచ్చి బొప్పాయి చాలా బాగా పని చేస్తుంది. మరి, బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడే పరగడుపున తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
1. జీర్ణక్రియలో సహాయపడుతుంది...
పచ్చి బొప్పాయిలో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడే ఎంజైమ్ అయిన పపైన్ పుష్కలంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో తిన్నప్పుడు.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. మలబద్దకం సమస్య కూడా ఉండదు.
2.డీటాక్స్..
ఫైబర్, నీరు ,విటమిన్లు A, C ,E వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండిన పచ్చి బొప్పాయి మంచి డీటాక్స్ గా పని చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరచడానికి, శరీరంలో నుంచి టాక్సిన్స్ బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీని వల్ల కాలేయం చాలా సమర్థవంతంగా పని చేస్తుంది.
3. రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది..
పచ్చి బొప్పాయిలో మంచి మోతాదులో విటమిన్ సి ఉంటుంది. పరగడుపున తినడం వల్ల దాని శోషణ ఆప్టిమైజ్ అవుతుంది. ఇది రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇస్తుంది. అంతేకాదు.. రక్తంలో షుగర్ లెవల్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
4.బరువు తగ్గించడంలో సహాయం చేసే పచ్చి బొప్పాయి..
పచ్చి బొప్పాయి తినడం వల్ల మనం చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే, బొప్పాయి తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల ఆకలిగా అనిపించదు. అదనపు కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉండదు. దీని వల్ల ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఇందులో ఉండే ఫైబర్... శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్లతో నిండిన బొప్పాయి చర్మ కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. పచ్చి బొప్పాయితో మీ రోజును ప్రారంభించడం మీ చర్మంపై కూడా ప్రతిబింబిస్తుంది. ఇందులో విటమిన్ సి, ఎ ,యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది, చర్మ కణాలను నిర్విషీకరణ చేస్తుంది.ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, మొటిమలను తగ్గిస్తుంది.చర్మ మెరుపును మెరుగుపరుస్తుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా పచ్చి బొప్పాయిని మితంగా తినాలి. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది, ముఖ్యంగా సున్నితమైన వ్యక్తులలో. దీన్ని మీ ఆహారంలో చేర్చుకునే ముందు మీ డైటీషియన్‌ను సంప్రదించండి.