
మనలో చాలా మంది మాంసాహార ప్రియులు ఉండే ఉంటారు. వారిలో కొందరికి చికెన్ నచ్చితే.. మరి కొందరికి మటన్ నచ్చుతుంది. అయితే.. మటన్ తినడం ఇష్టం లేని వాళ్లు కూడా చాలా మంది మటన్ సూప్ మాత్రం తాగుతారు. ముఖ్యంగా మటన్ కాళ్ల సూప్. దీనినే పాయా అని కూడా పిలుస్తారు. కాళ్ల నొప్పులు లాంటివి ఉన్న వారు కూడా ఈ మటన్ సూప్ తాగితే మంచిదని, ఆ నొప్పులు తాగుతాయని కూడా చాలా మంది చెబుతుంటారు. అసలు.. ఈ మటన్ సూప్ ని కనీసం నెల రోజులు వరసగా తాగితే.. మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఓసారి తెలుసుకుందామా...
.
మటన్ సూప్ లో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. మేక కాలు మజ్జలో ఐరన్, సెలీనియం, విటమిన్ బి12, విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి.
ఎముక బలం
మటన్ సూప్ తాగడం వల్ల శరీరంలోని ఎముకలు ,కీళ్ళు బలపడతాయి. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం మొదలైనవి ఎముకల బలానికి చాలా అవసరం. ఎముకల నష్టాన్ని నిరోధించే లక్షణాలు కూడా మటన్ సూప్‌లో ఉన్నాయి. ఆస్టియోపోరోసిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా మటన్ సూప్ తాగాలి. ఒక నెల పాటు మటన్ సూప్ తాగడం కొనసాగించండి. ఎముకలు బలంగా మారతాయి. కాళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంది.
పేగు ఆరోగ్యం
మన ప్రేగుల పనితీరు,ఆరోగ్యాన్ని బట్టి మన శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయించవచ్చు. ఈ మటన్ సూప్ జీర్ణవ్యవస్థలో సులభంగా జీర్ణమవుతుంది. మటన్ సూప్ ప్రేగులలో సులభంగా శోషిస్తుంది, పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.మటన్ సూప్ తాగడం వల్ల మలబద్ధకం ఉండదు ఎందుకంటే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మటన్ సూప్ కడుపు సంబంధిత ఏదైనా సమస్యకు ఉత్తమ పరిష్కారం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మటన్ సూప్ మన నాడీ వ్యవస్థను సడలిస్తుంది. ఇది మనకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. మెదడులోని కణాల మధ్య సమాచార మార్పిడి వేగవంతం అవుతుంది. ఇది మెదడు మరింత చురుకుగా ఉండటానికి ,పనిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
మటన్ సూప్ తాగడం వల్ల మీకు అంత త్వరగా ఆకలి వేయదు. దీని కారణంగా, ఇతర ఆహారాలను మితంగా తింటాము. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మటన్ సూప్‌లో పసుపు పొడి, మిరియాలు ,వెల్లుల్లిని జోడించడం వల్ల దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ ,టీఆక్సిడెంట్ లక్షణాలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.