జలుబు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి తులసి నీళ్ళు సమర్థవంతంగా పని చేస్తాయి. ఉదయాన్నే పరగడుపున తులసి నీళ్ళు తాగితే జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గించేస్తాయి. కొలెస్ట్రాల్ తగ్గించి, హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తులసి నీళ్ళు తీసుకోవడం మంచిది. తులసి నీళ్ళు మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గించి, జ్ఞాపకశక్తి పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా తులసి నీళ్ళు బాగా పని చేస్తాయి.
నోటిలో ఇన్ఫెక్షన్లను నివారించి, నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీమైక్రోబయల్ లక్షణాలు తులసిలో ఉన్నాయి. తులసి నీళ్ళతో పుక్కిలిస్తే చిగుళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది, నోటి దుర్వాసన తగ్గుతుంది.