గోరువెచ్చని పాలతో..
పెరుగు పర్ఫెక్ట్ గా రావాలంటే.. పాలు ఎక్కువ వేడిగా కానీ, చల్లగా కానీ ఉండకూడదు. వేలు పెట్టినప్పుడు తట్టుకునేంత వేడిగా ఉంటే చాలు. త్వరగా పెరుగు తయారు కావాలంటే.. పాలల్లో వేయడానికి సాధారణం కంటే కొంచెం ఎక్కువ పెరుగు వాడాలి. ఒక కప్పు పాలకి ఒకటి నుంచి రెండు చెంచాల పెరుగు వాడొచ్చు. పుల్లగా, చిక్కగా ఉన్న పెరుగు వాడటం మంచిది.