Breakfast: పిల్లలకు ఉదయాన్నే పెట్టాల్సిన అద్భుతమై ఆహారాలు ఇవి..!

Published : Aug 13, 2025, 12:12 PM ISTUpdated : Aug 13, 2025, 12:13 PM IST

ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండిన సమతుల్యంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల పిల్లల మెదడు చాలా షార్ప్ గా పని చేస్తుంది. శారీరక అభివృద్ధి కి కూడా సహాయం చేస్తుంది.

PREV
14
breakfast

పిల్లలు ఆరోగ్యంగా, రోజంతా ఉత్సాహంగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. పిల్లలు అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం అందించే ఆహారం కూడా అలానే ఉండాలి. ముఖ్యంగా.. ఉదయం పిల్లలకు అందించే బ్రేక్ ఫాస్ట్ మరింత పోషకాలతో నిండి ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన, పోషకాలతో నిండిన సమతుల్యంగా ఉండే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల పిల్లల మెదడు చాలా షార్ప్ గా పని చేస్తుంది. శారీరక అభివృద్ధి కి కూడా సహాయం చేస్తుంది. ముఖ్యంగా..మరి.. ప్రతిరోజూ ఉదయాన్నే పిల్లలకు ఎలాంటి అల్పాహారం అందించడం వల్ల పిల్లలకు అవసరమయ్యే ప్రోటీన్లు, విటమిన్లు, న్యూటియంట్లు అందుతాయో తెలుసుకుందాం..

24
పిల్లలకు అందించాల్సి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్...

1. పన్నీర్ స్టప్ఫింగ్ తో మూంగ్ దాల్ చీలా...

పెసర పప్పు లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పన్నీర్ కూడా పిల్లల ఎదుగుదలకు చాలా మంచిది. ఇక పెసర పప్పు చాలా సులభంగా జీర్ణమౌతుంది. మీరు మూంగ్ దాల్ చీలాని పన్నీర్ తో స్టఫ్ చేసి నెయ్యితో కాల్చి పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లో అందించాలి. ఇది పిల్లలకు సంపూర్ణ భోజనం అవుతుంది. ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకల పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి.. వారంలో ఒక్క రోజు అయినా దీనిని అందించడానికి ప్రయత్నించండి. పిల్లల ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది.

2.పుదీనా- కొత్తిమీర చట్నీతో బేసన్ చీలా...

సెనగ పిండిలో ఫైబర్, ప్రోటీన్ రెండూ పుష్కలంగా ఉంటాయి. దీనిలో క్యారెట్, క్యాప్సికమ్, పాలకూర వంటి కూరగాయలను కలిపి వాటిని జోడించి పిల్లలకు అందించాలి. ఇది మంచి పోషకాలతో నిండిన ఆహారం. పుదీనా, కొత్తిమీర చట్నీ తో కూడిన ఈ బేసన్ చీలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగు అవ్వడంతో పాటు.. రుచి కూడా అద్బుతంగా ఉంటుంది.

34
3.మల్టీగ్రెయిన్ ర్యాప్‌లో పనీర్ భుర్జీ లేదా ఎగ్ భుర్జీ

పనీర్ , గుడ్డు రెండింటిలోనూ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వాటిని మల్టీగ్రెయిన్ చపాతీ లేదా ర్యాప్‌లో చుట్టి.. మీ పిల్లలకు అందించాలి. పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. పిల్లల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని అల్పాహారం లో అందించడం వల్ల పిల్లల కండరాల అభివృద్ధి, మెదడు పనితీరు, చురుకుదనాన్ని పెంచడానికి సహాయపడుతుంది.

44
ఇడ్లీ-సాంబార్

ఇడ్లీ చాలా సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. పిండి పదార్థాలు , ప్రోటీన్లతో నిండి ఉంటుంది. సాంబార్ వంటి పప్పు దినుసుతో వడ్డించినప్పుడు, ఇది పూర్తి పోషకాలను అందిస్తుంది. సాంబార్‌లో ఉండే కూరగాయలు, పప్పులు , సుగంధ ద్రవ్యాలు పిల్లల రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

డ్రైఫ్రూట్స్ , గింజలు లడ్డూ లేదా షేక్

బాదం, వాల్‌నట్‌లు, జీడిపప్పు, చియా గింజలు, అవిసె గింజలు , ఎండుద్రాక్షలతో తయారు చేసిన లడ్డూ లేదా షేక్ పిల్లలకు మెదడును పెంచే కొవ్వులు, ఐరన్, ఖనిజాలను అందిస్తుంది. ఇది శక్తినిచ్చే ఆహారం, ఇది పిల్లలను రోజంతా చురుకుగా ఉంచుతుంది. దీనితో పాటు, ఇది వారి ఏకాగ్రతను కూడా మెరుగుపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories