Junk Food Skin Effects: 30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే మీ ముఖంలో కనిపించే 5 మార్పులు ఇవే!

Published : Feb 02, 2026, 04:49 PM IST

జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అయినా సరే చాలామంది ఆ ఫుడ్ నే ఇష్టంగా తింటుంటారు. కానీ జంక్ ఫుడ్ ని ఒక 30 రోజులు మానేస్తే మీ శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా? ముఖ్యంగా ఫేస్ లో కనిపించే ఈ 5 మార్పులు చూస్తే షాక్ అవుతారు. 

PREV
16
30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే..

మనలో చాలామంది ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్‌డ్ స్నాక్స్, కేక్‌లు, చిప్స్ వంటి పదార్థాలను ఇష్టంగా తింటుంటారు. కానీ అవి మన శరీరం, ముఖ్యంగా చర్మంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణులు, స్కిన్ కేర్ ఎక్స్‌పర్ట్‌ల ప్రకారం కేవలం 30 రోజులు జంక్ ఫుడ్ మానేయడం ద్వారా ముఖంలో కలిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం.

26
మృదువుగా మారుతుంది

జంక్ ఫుడ్ ఎక్కువగా సాచ్యూరేటెడ్ ఫ్యాట్స్, షుగర్, ప్రాసెస్‌డ్ పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది చర్మంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచుతుంది. ముడతలు, ఎరుపు, పొడిబారడం వంటి సమస్యలకు కారణమవుతుంది. జంక్ ఫుడ్ మానేసిన వెంటనే, శరీరంలోని ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ తగ్గుతాయి. 30 రోజుల్లో చర్మం సహజంగా హైడ్రేటెడ్ గా, మృదువుగా మారుతుంది. ముఖ్యంగా కేకులు, కోల్డ్ డ్రింక్స్, చిప్స్ మానడం వల్ల చర్మం.. లోపలి తేమను నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది.

36
కొల్లాజెన్ ఉత్పత్తిపై ప్రభావం

షుగర్ అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని కొల్లాజెన్ దెబ్బతింటుంది. కొల్లాజెన్ శక్తిని కోల్పోవడం వల్ల చర్మంపై ముడతలు మొదలవుతాయి. 30 రోజులు జంక్ ఫుడ్ మానేయడం ద్వారా, కొల్లాజెన్ ఉత్పత్తి సక్రమంగా ఉంటుంది. దానివల్ల చర్మం స్థిరంగా ఉంటుంది, ముడతలు తగ్గుతాయి. కాంతివంతంగా మారుతుంది.

46
ముఖం స్లిమ్ గా కనిపించడం

జంక్ ఫుడ్ ఎక్కువగా సోడియం, ఫ్యాట్, ప్రాసెస్‌డ్ పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాటర్ రిటెన్షన్, మలినాలు, ఫేస్ బ్లోటింగ్ కు కారణమవుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, 30 రోజులు జంక్ ఫుడ్ మానేసి.. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఫేస్ బ్లోటింగ్ తగ్గి ముఖం స్లిమ్ గా కనిపిస్తుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్‌లు ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి మెరుగుపడుతుంది.

56
ముఖం ఫ్రెష్ గా..

జంక్ ఫుడ్ లోని ఫ్యాటీ, ప్రాసెస్‌డ్ పదార్థాలు శరీరంలోని యాంటీ-ఆక్సిడెంట్ స్థాయిలను తగ్గిస్తాయి. దానివల్ల చర్మం యూవీ కిరణాల ప్రభావానికి లోనవుతుంది. 30 రోజులు జంక్ ఫుడ్ మానేసి.. ఇతర ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకుంటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మ రికవరీని వేగవంతం చేస్తాయి. దీనివల్ల సన్ డ్యామేజ్ తగ్గి, చర్మం తాజాగా మారుతుంది.

66
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

చర్మంలో కనిపించే ఈ చిన్న చిన్న మార్పులు మానసికంగా పెద్ద మార్పులకు దారితీస్తాయి. 30 రోజులు జంక్ ఫుడ్ మానేస్తే.. ముఖం స్పష్టంగా మెరుస్తుంది, చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. దీని ద్వారా వ్యక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిపుణుల ప్రకారం జంక్ ఫుడ్ మానేయడం ఒక్క చర్మ ఆరోగ్యానికే కాదు.. మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories