Dosa Recipes: దోశలు ఇలా చేస్తే.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు!

Published : May 06, 2025, 07:57 PM IST

రోజూ ఒకే రకం దోశ తింటే బోర్ కొడుతోందా? అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి. దోశలు క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. రెండు దోశలు తినలేని వాళ్లు కూడా నాలుగు తింటారు. ఇక పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ క్రిస్పి దోశలు ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలెంటో ఇక్కడ చూద్దాం.

PREV
111
Dosa Recipes: దోశలు ఇలా చేస్తే.. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు!

బార్లీ దోశ

బార్లీ చాలా పోషకాలతో కూడింది. అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. బార్లీ దోశ సాధారణ దోశ కంటే క్రిస్పీగా, రుచిగా ఉంటుంది. జీర్ణక్రియకు మంచిది. బాగా శక్తినిస్తుంది.
 

211
బార్లీ దోశకి కావాల్సినవి

బార్లీ - 1 కప్పు

మినుములు- 1/4 కప్పు

మెంతులు - 1/4 స్పూను

ఉప్పు - తగినంత

నూనె - తగినంత తీసుకోవాలి.
 

311
బార్లీ దోశ తయారీ

బార్లీ, మినుములు, మెంతులు 4-6 గంటలు నానబెట్టాలి. మెత్తగా నూరి, ఉప్పు కలిపి 8-10 గంటలు పక్కనపెట్టాలి. ఆ తర్వాత దోశ పెనం మీద పలుచగా వేసుకోవాలి.
 

411
కొబ్బరి దోశ

కొబ్బరి దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు..

బియ్యం - 1 కప్పు

తురిమిన కొబ్బరి - 1/2 కప్పు

మెంతులు - 1/4 స్పూను

ఉప్పు - తగినంత

నూనె - తగినంత

511
కొబ్బరి దోశ తయారీ

బియ్యం, మెంతులు నానబెట్టి, తురిమిన కొబ్బరితో మెత్తగా నూరాలి. ఉప్పు కలిపి 6-8 గంటలు పులియబెట్టాలి. తర్వాత పెనం మీద పలుచగా దోశలు వేసుకోవాలి. వీటిని చట్నీ, సాంబారుతో తినచ్చు.

611
వేరుశనగ పిండి దోశ

వేరుశనగ పిండి దోశ మంచి పోషకాలతో కూడింది. త్వరగా తయారవుతుంది. పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ.

711
వేరుశనగ దోశకి కావాల్సినవి

బియ్యం పిండి, వేరుశనగ పిండి, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఉల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, నీళ్ళు, నూనె తగినంత.

811
వేరుశనగ దోశ తయారీ

పిండి, ఉల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, మిరియాలు, ఉప్పు, నీళ్లు కలిపి దోశ పిండి తయారు చేయాలి. తర్వాత దోశ పెనం మీద పిండి వేసి చుట్టూ నూనె వేసుకోవాలి.

911
సగ్గుబియ్యం దోశ

సగ్గుబియ్యం శరీరానికి చలువ చేస్తుంది. శక్తినిస్తుంది. ఈ దోశ మెత్తగా ఉంటుంది. జీర్ణం కావడానికి సులువుగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

1011
సగ్గుబియ్యం దోశకి కావాల్సినవి

సగ్గుబియ్యం, బియ్యం పిండి, రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నీళ్ళు, నూనె తగినంత.

1111
సగ్గుబియ్యం దోశ తయారీ

సగ్గుబియ్యం నానబెట్టి, గరుకుగా నూరాలి. పిండి, రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నీళ్లు కలిపి దోశ పిండి తయారు చేసుకోవాలి. దోశ పెనం మీద వేసి, నూనె వేసి కాల్చుకోవాలి. చట్నీ, సాంబారుతో తినచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories