Kitchen tips: ఈ వంటకాలను 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు!

Published : May 06, 2025, 06:52 PM IST

సాధారణంగా వంటింట్లో చాలా వేడిగా ఉంటుంది. సమ్మర్ లో అయితే ఇక చెప్పనవసరం లేదు. మరి ఎండాకాలంలో వంటింట్లో ఎక్కువసేపు ఉండకుండా తక్కువ టైంలో తయారయ్యే కొన్ని రుచికరమైన వంటకాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
Kitchen tips: ఈ వంటకాలను 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు!
ఉప్మా

ఉప్మా.. చాలా మంది ఇష్టంగా తినే టిఫిన్స్ లో ఒకటి. రవ్వతో తయారు చేసే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా రెడీ అవుతుంది. అంతేకాదు రవ్వలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. ఉప్మా తిన్న తర్వాత త్వరగా ఆకలి వేయదు. త్వరగా తయారయ్యే వంటకం కావాలంటే ఉప్మా బెస్ట్ ఆప్షన్.

26
సెమియా ఉప్మా

రుచికరమైన సెమియా ఉప్మా తయారు చేయడం చాలా సులభం. సెమియాలను ముందుగానే వేయించి నిల్వ చేసుకోవచ్చు. అప్పుడు అవసరమైనప్పుడు త్వరగా వండుకోవచ్చు. పిల్లలు కూడా సెమియా ఉప్మాను ఇష్టంగా తింటారు.

36
దోశ

పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినేవాటిలో దోశలు ముందు వరుసలో ఉంటాయి. శనగపిండి, రవ్వ దోశలు మంచి ఆప్షన్. ఇష్టమైన కూరగాయలు కలిపి దోశలు వేసుకోవచ్చు. దోశలను చాలా రకాలుగా, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు.

46
ఆమ్లెట్

ఫాస్ట్ గా తయారు చేసుకోవాలంటే ఆమ్లెట్ బెస్ట్ ఆప్షన్. గుడ్డు తినడానికి ఇష్టపడేవారు ఆమ్లెట్ వేసుకోవచ్చు. 10 నిమిషాల్లో తయారవుతుంది. బ్రెడ్ తో కలిపి తినచ్చు. టేస్టీగా ఉంటుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది.

56
బిసి బేలే బాత్

త్వరగా వంటకం కావాలంటే బేలే అన్నం బాగుంటుంది. కుక్కర్‌లో బేలే, అన్నం వండుకోవచ్చు. పప్పు ఉడికిన తర్వాత, కారం, ఇంగువ, జీలకర్ర తాలింపు వేసుకుంటే సరిపోతుంది.

66
వెజ్ సాండ్‌విచ్

వెజ్ సాండ్‌విచ్ తినడానికి చాలా బాగుంటుంది. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, మేయనీస్ తో సాండ్‌విచ్ తయారు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories