Kitchen Tips: మొలకెత్తిన ఉల్లిపాయ, బంగాళదుంపలు తింటే ఏమవుతుందో తెలుసా?

Published : Aug 01, 2025, 06:07 PM IST

కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాటిని సరైన పద్ధతిలో తినడం ముఖ్యం. కొన్ని కూరగాయలను మొలకెత్తిన తర్వాత తినడం అస్సలు మంచిది కాదటంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ చూద్దాం.  

PREV
15
కూరగాయల్లోని పోషకాలు

ఆరోగ్యకరమైన ఆహారాల్లో కూరగాయలు ముందువరుసలో ఉంటాయి. కూరగాయలలోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కూరగాయల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. కూరగాయల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు కొన్ని రకాల కూరగాయలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలోనూ సహాయపడతాయి. 

25
మొలకెత్తిన కూరగాయలు తింటే ఏమవుతుంది?

కూరగాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. వాటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో తినడం ముఖ్యం. కొన్ని కూరగాయలకు మొలకలు వస్తుంటాయి. ముఖ్యంగా ఉల్లిపాయ, బంగాళదుంప వంటివి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వాటిపై చిన్న చిన్న మొలకలు వస్తాయి. చాలామంది వీటిని అలాగే ఉపయోగిస్తుంటారు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి మొలకెత్తిన కూరగాయలు తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.  

35
ఉల్లిపాయ

ఉల్లిపాయలను మనం చాలారకాల వంటల్లో ఉపయోగిస్తుంటాం. కాబట్టి వాటిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటాం. ఆ క్రమంలో ఉల్లిపాయలకు మొలకలు వచ్చే అవకాశం ఉంది. ఈ మొలకెత్తిన ఉల్లిపాయలు అధిక స్థాయిలో ఆల్కలాయిడ్‌లను ఉత్పత్తి చేస్తాయి. ముఖ్యంగా ఎన్-ప్రొపైల్ డైసల్ఫైడ్. ఇది ఎర్ర రక్త కణాలను దెబ్బతీస్తుంది. అనీమియాకు కారణమవుతుంది. కాబట్టి మొలకెత్తిన ఉల్లిపాయలను తినకపోవడమే మంచిది.

45
వెల్లుల్లి

ఉల్లిపాయల మాదిరిగానే మొలకెత్తిన వెల్లుల్లిని కూడా తినడం మానుకోవాలి. ఇది కూడా ఆరోగ్యానికి హానికరం. నిజానికి మొలకెత్తిన వెల్లుల్లిలో అధిక సాంద్రత కలిగిన సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వీటి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

55
బంగాళదుంప

బంగాళదుంపను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. అయితే బంగాళదుంప మొలకెత్తితే దాన్ని తినడం మానుకోవాలి. చాలా మంది మొలకెత్తిన భాగాన్ని తీసివేసి మిగిలిన భాగాన్ని ఉపయోగిస్తారు. కానీ అది మంచిది కాదు. మొలకెత్తిన బంగాళదుంప తినడం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, నాడీ సంబంధిత సమస్యలు వస్తాయి.  

Read more Photos on
click me!

Recommended Stories