Weight Loss: రాత్రి పడుకునే ముందు రోజూ మజ్జిగ తాగితే బరువు తగ్గుతారా?

Published : Aug 01, 2025, 12:10 PM IST

ఎండాకాలంలో ఈ మజ్జిగ తాగితే.. మనకు వేడి చేయకుండా ఉంటుందని, శరీరాన్ని చల్లగా మార్చడానికి సహాయపడుతుందని నమ్ముతారు.

PREV
13
మజ్జిగ రాత్రిపూట తాగితే ఏమౌతుంది?

మజ్జిగ అనేది ప్రోబయోటిక్ అధికంగా ఉండే ఆహారం. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఎక్కువ మంది వేసవిలో మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు. ఎండాకాలంలో ఈ మజ్జిగ తాగితే.. మనకు వేడి చేయకుండా ఉంటుందని, శరీరాన్ని చల్లగా మార్చడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అంతేకాదు.. బరువు తగ్గడానికి, లేదా ఏదైనా కడుపు సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అయితే.. ఈ మజ్జిగ రోజు రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల బరువు తగ్గుతారా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...

23
మజ్జిగలో పోషకాలు..?

మజ్జిగలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి2, విటమిన్ బి12 అలాగే పొటాషియం, భాస్వరం, అయోడిన్, జింక్, ప్రోబయోటిక్స్ ఉంటాయి.ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. మొత్తం ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

మజ్జిగ బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుంది?

మజ్జిగలో ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ , బిఫిడోబాక్టీరియం బిఫిడమ్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది. మజ్జిగ తాగిన తర్వాత, కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. మజ్జిగలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి సమయం పడుతుంది. తొందరగా ఆకలిగా అనిపించదు. ఫలితంగా ఇతర కేలరీలు ఎక్కువగా తీసుకోం. దీంతో.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

33
రాత్రిపూట మజ్జిగ ఎందుకు తాగాలి?

మీరు బరువు తగ్గాలనుకుంటే, పగటిపూట కాకుండా రాత్రిపూట మజ్జిగ తాగడం మంచి ఎంపిక. రాత్రిపూట మజ్జిగ తాగడం ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోండి.

మజ్జిగలో ఉండే ప్రోటీన్ , కాల్షియం మిమ్మల్ని ఎక్కువసేపు ఆకలిగా అనిపించనివ్వవు. దీని కారణంగా, అర్ధరాత్రి జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగకుండా ఉంటుంది. దీని కారణంగా ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

మజ్జిగలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది. ఒక వ్యక్తికి మంచి నిద్ర రాకపోతే, కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది, ఇది కొవ్వును పెంచుతుంది.

రాత్రిపూట జీలకర్ర , నల్ల మిరియాలతో కలిపిన మజ్జిగను తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి అవసరమైన జీవక్రియ కూడా బాగానే ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories