క్వినోవా స్మూతీ
ఉడికించిన క్వినోవాతో అరటిపండు, బెర్రీస్, మామిడిపండు, పాలు లేదా పెరుగు, కొద్దిగా తేనె లేదా మాపుల్ సిరప్ కలిపి మెత్తగా బ్లెండ్ చేయండి. ఆకుకూరలు కలిపితే అదనపు పోషకాలు యాడ్ అవుతాయి. పోషకాలతో కూడిన ఈ స్మూతీ మీరు ఇన్ స్టంట్ శక్తినిస్తుంది.
క్వినోవా, వెజిటబుల్ సలాడ్
చల్లటి ఉడికించిన క్వినోవాతో తరిగిన దోసకాయ, టమాటా, క్యాప్సికమ్, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం లేదా ఆలివ్ ఆయిల్ కలిపి తినవచ్చు. ఇది తేలికైన, శరీరాన్ని రిఫ్రెష్ చేసే ఫుడ్ అవుతుంది. ఉడికించిన చిక్కుళ్ళు లేదా బ్లాక్ బీన్స్ కలిపితే అదనపు ప్రోటీన్, ఫైబర్ లభిస్తుంది.