Worlds Most Popular Drink : టీ లేదా కాఫీ - ఏది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం? టీ గ్లోబల్ ఫేవరెట్‌గా ఎలా మారిందో, కాఫీ ఎందుకు రెండో స్థానంలో ఉందో చూద్దాం.
మన దేశంలో టీ బాగా పాపులర్.. అయితే కొన్నిదేశాల్లో కాఫీ బాగా తాగుతుంటారు. మరి ప్రపంచంలో టీ ఎక్కువ పాపులరా లేక కాఫీనా? అనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. భారతదేశంలో టీకి క్రేజ్ ఉంటే, యూరప్-అమెరికాలో కాఫీపై మోజు ఎక్కువ. కానీ ప్రపంచం మొత్తం విషయానికి వస్తే సమాధానం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. అసలు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం ఏది? ఎందుకు? కాస్త లాజికల్ గా ఆలోచిస్తే మీరు కూడా ఇట్టే జవాబు చెప్పొచ్చు.
25
నీరు- ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం
“పానీయం” అనే పదాన్ని విస్తృత అర్థంలో చూస్తే ద్రవ పదార్థం. కాబట్టి నీరు ప్రపంచంలో అత్యధికంగా తాగే పానీయం.
ప్రతి మనిషి రోజూ నీరు తాగుతాడు.. ఇతర జంతువులు కూడా నీటినే తాగి బ్రతుకుతాయి. ఏ దేశం, సంస్కృతి, వయస్సు వారైనా సరే నీరు తాగకుండా ఉండలేరు. నీరు లేకుండా ఏ జీవి బతకలేదు.
సాధారణంగా నీటిని “పానీయం” కేటగిరీలో లెక్కించకపోయినా, వినియోగం విషయంలో ఇదే నంబర్-1. నీరు లేకుండా జీవనం సాధ్యం కాదు, అందుకే ఇది అన్ని పానీయాలను వెనక్కి నెట్టేస్తుంది.
35
టీ- ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వేడి పానీయం
మనిషి తయారుచేసే పానీయాల గురించి మాట్లాడితే టీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం.
చైనా, భారతదేశం, జపాన్, యూకే, రష్యా, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో టీ రోజువారీ జీవితంలో, అలవాటులో ఒక భాగం.
బ్లాక్ టీ, గ్రీన్ టీ, హెర్బల్ టీ, మిల్క్ టీ- దీనికి లెక్కలేనన్ని రకాలున్నాయి.
తక్కువ ధర, సులభంగా దొరకడం, ఆరోగ్య ప్రయోజనాలు, రోజూ తాగే అలవాటు వల్ల టీ గ్లోబల్ ఫేవరెట్‌గా నిలిచింది.