Bio War: జీవయుద్ధం అంటే బయోలాజికల్ వార్. ఎలాంటి మారణాయుధాలు వాడకుండా సూక్ష్మజీవులైన వైరస్, బ్యాక్టీరియాలు, పురుగులతో మనుషులను చంపేసే ఒక యుద్ధం. దీన్ని పూర్వం చెంఘిస్ ఖాన్ అనే యోధుడు విపరీతంగా వినియోగించేవాడు.
యుద్ధం అంటే కత్తులు, తుపాకులతో సాగే మారణ హోమం. చెంఘిస్ ఖాన్ కత్తులతో పాటు ఒక బండి నిండా భయంకరమైన పురుగులను, రోగాలను వ్యాప్తి చేసే సూక్ష్మజీవులను తీసుకొని వెళ్లేవాడు. అతడు జీవ యుద్ధాన్ని పూర్వకాలంలోనే ప్రారంభించాడని చెబుతారు. చెంఘిజ్ ఖాన్ పేరు వింటే భయంకరమైన యోధుడు గుర్తొస్తాడు. అతడు మంగోల్ సైన్యాధిపతి. ఆసియా నుంచి యూరప్ వరకు విస్తరించిన అతని సామ్రాజ్యం వెనుక ఆయుధ బలం మాత్రమే కాదు, అద్భుతమైన వ్యూహాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యూహాల్లో బండినిండా పురుగులు తీసుకువెళ్లడం కూడా ఒకటి. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు. కానీ ఆ కాలంలో ఇది చెంఘిజ్ ఖాన్ తిరుగులేని యోధుడిగా మార్చింది.
24
పురుగులతో యుద్ధం ఏంటి?
పూర్వం వైద్యం అభివృద్ధి చెందలేదు. శుభ్రత కూడా తక్కువగా ఉండేది. వ్యాధులు అతివేగంగా వ్యాపించే కాలం అది. ఈ బలహీన పరిస్థితులనే తన ఆయుధంగా మార్చుకున్నాడు చెంఘిజ్ ఖాన్. యుద్ధానికి వెళ్లేటప్పుడు లేదా శత్రుకోటలను ముట్టడించేటప్పుడు పురుగులు పట్టిన వస్తువులు, చనిపోయిన జంతువుల శవాలు, వ్యాధులు ఉన్న పదార్థాలు శత్రు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి వేసేవాడు. అందుకోసం తనతో పాటు పెద్ద బండిలో వాటిని తీసుకెళ్లేవాడు. కోట లోపలికి వాటిని విసిరి వేయించేవాడు. దీంతో శత్రు సైన్యంలో ఉన్నవారికి ప్లేగు, జ్వరం, చర్మవ్యాధులు వంటివి త్వరగా వ్యాపించేవి. శత్రు సైన్యం బలహీనమైపోయేది. దీంతో యుద్ధం చేయకుండానే కోటలు చెంఘిజ్ ఖాన్ ముందు లొంగిపోయేవి.
34
రెండు విధాలుగా లాభం
ఇలాంటి పురుగులు, సూక్ష్మజీవులను వాడే వ్యూహం చెంగిజ్ ఖాన్ రెండు విధాలుగా లాభం చేసింది. ఒకటి తన సైనికుల మరణించకుండా కాపాడుకోవడమే కాదు శత్రువులలో భయం పెరిగిపోయేది. వారు రకరకాల వ్యాధులతో బలహీనంగా మారిపోయేవారు. అంతేకాదు మంగోల్స్ వస్తే భయంకరమైన రోగాలు వస్తాయి అనే భయం చుట్టుపక్కల రాజ్యాల్లో కూడా పెరిగిపోయేది. ఈ మానసిక భయమే చెంగిజ్ ఖాన్ కు పెద్ద ఆయుధంగా మారిపోయింది. ఎన్నోసార్లు యుద్ధం చేయకుండానే కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ఇతడు శారీరకంగా బలవంతుడే కాదు మానసికంగా చాలా తెలివైనవాడు కూడా.
చెంగిజ్ ఖాన్ చాలా తెలివైనవాడు.. కాబట్టే కష్టం లేకుండా యుద్ధాలను గెలిచాడు. వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో ఆయన అనుభవంతో తెలుసుకున్నాడు. ఆ జ్ఞానాన్ని యుద్ధ వ్యూహంగా మార్చుకున్నాడు. ఇప్పటి కాలంలో మనం ఆలోచిస్తే ఇది అమానుషంగా అనిపిస్తుంది కానీ ఆ కాలంలో మాత్రం అది విజయ రహస్యం, తెలివైన తంత్రం. శత్రువు బలహీనతనే తన బలంగా మార్చుకోవడం. అందుకే అతను చరిత్రలో శక్తివంతమైన యోధుడు అనే పేరును ఇప్పటికీ నిలబెట్టుకున్నాడు.