World’s First Vegetarian City: అయోధ్య, వారణాసి కాదు.. గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే !

Published : May 15, 2026, 03:49 PM IST

World First Vegetarian City: గుజరాత్‌లోని పాలిటానా ప్రపంచంలోనే మొదటి వెజిటేరియన్ సిటీగా రికార్డు సృష్టించింది. ఇక్కడ నాన్ వెజ్ మాత్రమే కాదు చివరికి గుడ్లు అమ్మినా కూడా జైలు శిక్ష తప్పదు. ఈ సిటీ ప్రత్యేకత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
గుడ్డు అమ్మినా జైలుకెళ్లే దేశంలోని ఏకైక నగరం ఇదే

భారతదేశంలో ఎన్నో పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వారణాసి, రిషికేష్, తిరుపతి లాంటి నగరాల్లో గుడుల చుట్టుపక్కల శాఖాహార ప్రాంతాలు, పవిత్రమైన వీధులు, సాంప్రదాయాలు ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ గుజరాత్‌లోని ఒక చిన్న నగరం వాటన్నింటికంటే ఒక అడుగు ముందుకు వేసింది. అక్కడ నాన్-వెజ్ తినడం, అమ్మడంపై పూర్తిగా చట్టపరమైన నిషేధం విధించింది. కేవలం చికెన్, మటన్ మాత్రమే కాదు.. అక్కడ ఒక గుడ్డు అమ్మినా సరే జైలు పాలవ్వాల్సిందే.

25
ప్రపంచంలోనే తొలి నాన్ వెజ్ ఫ్రీ సిటీ

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఉంది పాలిటానా అనే చిన్న నగరం. ఇది అహ్మదాబాద్‌కు దాదాపు 214 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శత్రుంజయ కొండల చుట్టూ నిర్మితమైన ఈ పట్టణం జైనుల అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ కొండలపై దాదాపు 900 కి పైగా జైన్ దేవాలయాలు ఉన్నాయి. 2014 లో పాలిటానా ఒక చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మాంసం, చేపలు, గుడ్ల అమ్మకాలను, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన మొదటి నగరంగా ఇది రికార్డులకెక్కింది.

35
200 మంది సాధువుల పోరాటం

నిషేధం వెనుక ఒక పెద్ద కథే ఉంది. 2014 లో పాలిటానాలో దాదాపు 200 మంది జైన్ మునులు, సాధువులు ఒక పెద్ద పోరాటానికి దిగారు. నగరంలో, దాని చుట్టుపక్కల నడుస్తున్న సుమారు మాంసం దుకాణాలను ప్రభుత్వం వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దాంతో స్థానిక అధికారులపై, ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది.

45
ప్రభుత్వం సంచలన నిర్ణయం

సాధువుల సుదీర్ఘ నిరసనకు గుజరాత్ ప్రభుత్వం స్పందించింది. పాలిటానా నగర పరిధిలో మాంసం, గుడ్ల అమ్మకాలతో పాటు జంతు వధను పూర్తిగా నిషేధిస్తూ అధికారికంగా చట్టం తెచ్చింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన శిక్షలు ఉంటాయి. ఈ నగరంలో గుడ్డు అమ్మడం అనేది కేవలం తప్పు మాత్రమే కాదు.. జైలు శిక్ష పడేంత పెద్ద నేరం. జైన మతంలో అహింసకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఏ జీవిని హింసించకూడదనేది వారి ముఖ్య సూత్రం. 2500 ఏళ్లుగా వారు నమ్ముతున్న సిద్ధాంతానికి ఈ చట్టం ద్వారా అధికారిక గుర్తింపు లభించింది.

55
రాత్రికి రాత్రే మారిన ఫుడ్ సీన్.. కానీ?

ఈ నిషేధం తర్వాత పాలిటానా నగర రూపురేఖలు మారిపోయాయి. భక్తులు, పర్యాటకుల కోసం వందలాది వెజిటేరియన్ రెస్టారెంట్లు వెలిశాయి. గుజరాతీ థాలీలు, స్నాక్స్, స్వీట్లు ప్రతి మెనూలో చేరిపోయాయి. అంతకుముందు నాన్-వెజ్ అమ్మే వ్యాపారులు కొందరు వెజిటేరియన్ బిజినెస్‌లోకి మారగా, మరికొందరు నగరాన్ని విడిచి వెళ్లిపోయారు.

అయితే, ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించలేదు. నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛను హరించడమేనని కొందరు కోర్టు మెట్లెక్కారు. స్థానిక ముస్లింలు, నాన్ జైన్ ప్రజలు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన నమ్మకాలు వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories