మగాళ్లంటే ఓకే.. పక్షులు కూడా ఆడాళ్ళను చూసి వణికిపోతాయట.. ఎందుకో తెలుసా..?

Published : May 15, 2026, 02:53 PM IST

పక్షులపై చేపట్టిన ఓ పరిశోధనలో నమ్మలేని నిజం బయటపడింది. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లను చూస్తేనే పక్షులు ఎక్కువగా భయపడతాయట. వాళ్లు దగ్గరికి రాకముందే ఎగిరిపోతున్నాయని సైంటిస్టులు గుర్తించారు. పక్షుల ఈ వింత ప్రవర్తన వెనుక అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. 

PREV
15
పక్షులు ఆఢవాళ్లకే ఎక్కువ భయపడతాయా..?

Bird Behaviour : పక్షులకు ఆడవాళ్లంటే ఎక్కువ భయం..? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమేనని సైంటిస్టులు చెప్తున్నారు. మగవాళ్లు దగ్గరికి వచ్చినా ధైర్యంగా ఉండే పక్షులు ఆడవాళ్లు రాగానే అలర్ట్ అవుతాయట, భయంతో చటుక్కున ఎగిరిపోతాయట. అసలు పక్షులు ఆడా, మగ తేడాను గుర్తిస్తాయా...? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మగాళ్ళు భార్యలకు భయపడినట్లే పక్షులు కూడా భయపడటం వెనక ఆసక్తికర రీజన్ ఉందని పరిశోధనలో తేలింది.

25
పక్షుల ప్రవర్తనపై ఆసక్తికర స్టడీ...

ప్రకృతిలో పక్షుల ప్రవర్తన ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. తాజాగా యూరప్‌లోని పట్టణ ప్రాంతాల పక్షులపై ఒక అంతర్జాతీయ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పక్షులు మగవాళ్ల కన్నా ఆడవాళ్లను చూసే ఎక్కువ భయపడతాయని, వెంటనే ఎగిరిపోతాయని ఈ స్టడీలో తేలింది. 'పీపుల్ అండ్ నేచర్' అనే జర్నల్‌లో ప్రచురితమైన ఈ ఆర్టికల్ ఇప్పుడు సైంటిస్టుల్లోనే కాదు సామాన్య ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది.

35
37 జాతుల పక్షులపై ప్రయోగం..

పక్షుల భయాన్ని కొలవడానికి రీసెర్చర్లు 'ఫ్లైట్ ఇనిషియేషన్ డిస్టెన్స్' (Flight Initiation Distance) అనే పద్ధతిని వాడారు. అంటే ఒక మనిషి పక్షికి ఎంత దగ్గరగా వెళ్తే అది భయపడి ఎగిరిపోతుంది అనే దూరాన్ని వాళ్లు లెక్కించారు. ఐదు వేర్వేరు దేశాల్లో 37 జాతుల పక్షులపై ఈ ప్రయోగం చేశారు. సగటున మగవాళ్లు దగ్గరికి వెళ్లినప్పుడు పక్షులు మూడు అడుగుల కన్నా దగ్గరగా రానిచ్చాయి. కానీ ఆడవాళ్లు దగ్గరికి వెళ్తే మాత్రం, అంతకంటే ముందే భయపడి ఎగిరిపోయాయి.

45
మగా-ఆడా తేడాను పక్షులు ఎలా గుర్తిస్తున్నాయి..?

ఈ పరిశోధనలో పాల్గొన్న మగవాళ్లు, ఆడవాళ్లు దాదాపు ఒకే ఎత్తు, బరువు ఉన్నప్పటికీ... పక్షులు వాళ్ల మధ్య తేడాను స్పష్టంగా గుర్తించగలిగాయి. మనుషులు నడిచే తీరు, శరీరాకృతి, జుట్టు పొడవు వంటి చిన్న చిన్న తేడాలను కూడా పక్షులు గమనిస్తున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు. కంటిచూపుతో పాటే వాసన ద్వారా కూడా పక్షులు లింగ భేదాన్ని గుర్తిస్తున్నాయేమోనని అనుమానిస్తున్నారు. మగవాళ్లు, ఆడవాళ్ల నుంచి వచ్చే రసాయన సంకేతాలు పక్షులకు సూచనలు ఇస్తున్నాయేమోనని అంచనా వేస్తున్నారు.

55
ఆడవాళ్లంటేనే పక్షులకు ఎందుకు ఎక్కువ భయం?

ఈ రహస్యం వెనుక అసలు కారణం ఏంటనేది సైంటిస్టులకు ఇంకా కచ్చితంగా తెలియలేదు. కానీ వాళ్లు ఒక ఆసక్తికరమైన సిద్ధాంతాన్ని (థియరీ) ముందుకు తెచ్చారు. "వేల ఏళ్ల క్రితం, ఆదిమ కాలంలో మగవాళ్లు పెద్ద జంతువులను వేటాడేవారు. కానీ ఆడవాళ్లు పక్షుల వంటి చిన్న జీవులను వేటాడి చంపే బాధ్యత తీసుకునేవారు. ఎన్నో తరాలుగా జరిగిన ఈ ప్రక్రియ వల్ల, ఆడవాళ్లను చూడగానే పక్షుల్లో ఒకరకమైన సహజమైన భయం ఏర్పడి ఉండొచ్చు" అని చెప్తున్నారు.

ఇంకా వీడని మిస్టరీ

UCLAకి చెందిన ఈ స్టడీ రచయిత డేనియల్ బ్లూమ్‌స్టైన్ మాట్లాడుతూ, "మా రీసెర్చ్ ఫలితాలు అన్ని దేశాల్లోనూ ఒకేలా ఉన్నాయి. కానీ పక్షులు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాయో చెప్పడానికి ఇంకా బలమైన కారణం కావాలి" అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న వివరణలు కాస్త అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పక్షుల మెదడు మనల్ని ఎలా చూస్తుందనే విషయంలో ఇదొక పెద్ద ముందడుగు అని డేనియల్ బ్లూమ్‌స్టైన్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories