Japan Houses: మనదేశంలో 1BHK అంటే రూ.10 వేల నుంచి రూ.15 వేల అద్దె ఉంటుంది. కానీ జపాన్ లో చిన్న గది కూడా రూ.45వేలు ఉంటుంది. ఇళ్లు కూడా చిన్నవిగా ఉంటాయి. రెండు ఇళ్ల మధ్య నడవడానికి కూడా సందు ఉండదు. ఇంత డెవలప్ అయిన జపాన్ లో ఇళ్లు ఎందుకు చిన్నగా ఉంటాయి?
జపాన్ని చూస్తే అక్కడి ఇళ్లు చాలా వరకు ఇరుకుగా, చిన్న చిన్న స్థలాల్లో ఉంటాయి. కొన్ని ఇళ్ల మధ్య నడవడానికి కూడా పెద్దగా ఖాళీ ఉండదు. ఒక చిన్న స్థలంలోనే రెండు, మూడు అంతస్తుల ఇళ్లు కనిపిస్తాయి. మరి మన దగ్గర విశాలమైన ఇల్లు కట్టుకోవాలని చాలామంది కోరుకుంటే.. జపాన్లో మాత్రం ఇంత చిన్నగా ఎందుకు ఉంటాయి? దానికి ముఖ్యంగా 6 రీజన్స్ ఏంటో చూద్దాం.
25
భూమి తక్కువగా ఉంటుంది
జపాన్ లో ల్యాండ్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇండియాలో భూమి ఎక్కువగా ఉంటుంది. అందుకే విశాలంగా కట్టుకుంటాం. జపాన్ వాళ్లు ఉన్న దాంట్లో చిన్న చిన్నగా కట్టుకుంటారు. చిన్న కంట్రీ కాబట్టి ప్లేస్ ఉండదు. తక్కువ స్థలంలోనే యూనిక్ గా కట్టుకుంటారు.
35
జపాన్ లో భూకంపాలు ఎక్కువ
జపాన్ లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. అందుకే ఇల్లు కట్టుకొనేటప్పుడే భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. భూకంపాలను తట్టుకునేలా ప్రత్యేక నిర్మాణ ప్రమాణాలను పాటిస్తారు. ఇల్లు కట్టేటప్పుడే కింద ఎర్క్ క్వాక్ షాక్ అబ్జార్వర్లు పెడతారు. దానిని సెసమిక్ డ్యాంపర్లు అంటారు. ఖర్చు ఎక్కువ. భూకంపాలు వచ్చినప్పుడు ఇళ్లు జస్ట్ ఊగి ఆగిపోతాయి కాబట్టి. నష్టం తక్కువ జరుగుతుంది.
మూడో విషయం...ఇంటిని రెంట్ కు తీసుకునేటప్పుడు మధ్యలో కమిషన్లకే ఎక్కువగా పోతాయి. ఏజేన్సీ, రెన్యువల్ అంటూ రూ.లక్ష తీసుకుంటారు. జపాన్ లో ఇంగ్లీష్ మాట్లాడరు. విదేశీయులకు జపాన్ లో ఇళ్లు ఇవ్వరు. అందుకే మధ్యవర్తులే డీలింగ్ చేసి రెంట్ ఇప్పిస్తారు. దాని వల్ల రెంట్ పెరుగుతుంది.
బాత్ రూం, టాయిలెట్ వేర్వేరుగా ఉంటాయి. కచ్చితంగా బాత్ టబ్ ఉంటుంది. పైన వెంటిలేషన్ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే జపాన్ లో చలిని తట్టుకోలేం. బట్టలు ఆరేసిన ఆరవు. కాబట్టి లోపలే డ్రయ్యర్స్ ఉంటాయి. వెంటిలేషనే డ్రయ్యర్, కూలింగ్...ఇలా అన్ని రకాలుగా వాడుకునేలా డిజైన్ చేశారు.
55
ఇళ్ల గోడలు చాలా పల్చగా ఉంటాయి
జపాన్ లో ఇళ్ల గోడలు చాలా పల్చగా ఉంటాయి. పక్కింట్లో మాట్లాడుకునేవి మన ఇంట్లోకి వినిపిస్తాయి. భూకంపాలు వచ్చినప్పుడు బరువు అపార్ట్ మెంట్ తట్టుకునేలా, ఊగడానికి ఈజీగా ఉండేలా డిజైన్ చేస్తారట.
అయితే జపాన్లో ప్రతి ఇల్లు చిన్నదే అనుకోవడం పొరపాటే. టోక్యో వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో చిన్న ఇళ్లు, అపార్ట్మెంట్లు ఎక్కువగా కనిపిస్తాయి. అదే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఇళ్లు, విశాలమైన ప్రాంగణాలు ఉన్న సంప్రదాయ నివాసాలు కూడా కనిపిస్తాయి.
మొత్తానికి జపాన్లో చిన్న ఇళ్ల నిర్మాణం అనేది కేవలం స్థలం ఆదా చేసుకోవడానికి మాత్రమే కాదు. అందుబాటులో ఉన్న వనరులతో సౌకర్యవంతమైన జీవితాన్ని ఎలా గడపాలనే ఆలోచనకు కూడా నిదర్శనం. తక్కువ స్థలంలోనూ అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవచ్చని జపాన్ గృహ నిర్మాణ విధానం చెబుతోంది.