Beer Capital: ఎక్కువ మంది ఇష్టపడే పానీయాల్లో బీర్ కూడా ఒకటి. ఇలాంటి బీర్ కి ప్రత్యేకంగా ఒక రాజధాని కూడా ఉంది. అక్కడ మంచినీటి కంటే కూడా బీర్ కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
ప్రపంచంలో అత్యంత పురాతనమైన, ఎక్కువ మంది ఇష్టపడే పానీయాల్లో బీర్ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా అనేక నరగాల్లో రకరకాల క్రాఫ్ట్ బీర్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఒకే ఒక్క నగరంలో మాత్రం బీర్ అనేది కేవలం ఒక పానీయం కాదు, అది వారికి ఒక ట్రెడిషన్, వారి జీవన విధానంలో ఒక భాగం. వందల ఏళ్ల చరిత్ర ఉన్న బ్రూవరీలు, నిత్యం హడావిడిగా ఉండే భారీ హాల్స్, ప్రపంచంలోనే అతి పెద్ద బీర్ ఫెస్టివల్ నిర్వహించే ప్రదేశంగా నిలిచి, ‘ ది బీర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్’ అని పేరు తెచ్చుకున్న నగరం మరేదో కాదు.. జర్మనీలోని మ్యూనిచ్.
23
మ్యూనిచ్ కి ఆ పేరు ఎలా వచ్చింది?
మ్యూనిచ్ ని ప్రపంచపు బీర్ రాజధానిగా పిలవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీని వెనక వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది, ఇక్కబ బీర్ తయారీ కేంద్రాలు... వందల ఏళ్లుగా అక్కడ ఉన్నాయి. అది కూడా చాలా ట్రెడిషనల్ పద్దతిలో ది బెస్ట్ బీర్స్ అక్కడ తయారు చేస్తారు. అంతేకాదు, ఇక్కడ జర్మనీకి చెందిన ప్రసిద్ధ బీర్ పరిశుద్ధత చట్టాన్ని ఇక్కడ పాటిస్తారు. దీని ప్రకారం, కేవలం కొన్ని పరిమిత, సహజసిద్ధమైన పదార్థాలతో మాత్రమే నాణ్యమైన బీర్ ని తయారు చేస్తారు.
33
బీర్ తో పండగ చేసుకుంటారు..
ఈ నగరంలో బీర్ వారి సంస్కృతిలో భాగం అయిపోయింది. ఇక్కడ ప్రజలు కేవలం బీర్ తాగి వదిలేయరు. అందరూ ఒకే చోట చేరి బీర్ గార్డెన్లు, హాల్స్ లో ఒక పండగలా జరుపుకుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీర్ పండగ ఇక్కడ జరుపుకుంటారు. మ్యూనిచ్ నగరానికి ప్రపంచవ్యాప్తగా ఈ స్థాయిలో గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ప్రతి ఏటా అక్కడ జరిగే అక్టోబర్ ఫెస్ట్ కారణం. ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద బీర్ ఉత్సవం ఇక్కడ జరుపుకుంటారు. ఈ బీర్ పండగకు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు తరలివస్తారు. ఈ ఫెస్టివల్ కోసం ప్రత్యేకంగా బీర్ తయారు చేస్తారు. పెద్ద పెద్ద గాజు లీటర్ గ్లాసులలో బీర్ ఇస్తారు. అంతేకాకుండా, సంప్రదాయ వంటకాలు చేసి వడ్డిస్తారు. వాటిని వచ్చిన ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ లభించే బీర్ రకాలు...
లాగర్స్.. చాలా తేలికగా, రిఫ్రెషింగ్ గా ఉంటాయి. వీట్ బీర్స్.. గోధుమలతో చేసే లేత పండ్ల సువాసన ఉండే బీర్ ఇది. డార్క్ బీర్స్.. కాస్త చిక్కగా, ముదురు రంగులో మాల్ట్ రుచితో ఉంటాయి. మ్యూనిచ్ వీధుల్లో పెద్ద పెద్ద బెంచీలపై కూర్చొని, అందరితో కలిసి పంచుకునే ఆ అనుభవమే ఈ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.