Phone Before Bed: పడుకునే ముందు ఫోన్ వాడుతున్నారా? ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే !

Published : Aug 02, 2026, 10:48 AM IST

Using Phone Before Bed: రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడితే మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల కలిగే ప్రమాదాలు, లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
పడుకునే ముందు రీల్స్ చూస్తున్నారా? మీ మైండ్‌కి ఎంత డేంజరో తెలిస్తే షాక్ అవుతారు

రాత్రి పడుకునే ముందు బెడ్‌పై వాలి సోషల్ మీడియా పేజీలు స్క్రోల్ చేయడం, గంటల తరబడి వీడియాలు చూడటం మీకు అలవాటా? రోజువారీ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మీరు ఇలా చేస్తుండవచ్చు. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ మెదడు పనితీరుకు తీవ్ర హాని కలిగిస్తుందని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

26
ఉదయం ఎక్కువ సేపు నిద్రపోతే సరిపోతుందా?

రాత్రి ఆలస్యంగా పడుకుని, ఉదయాన్నే కాసేపు ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఈ సమస్య తీరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా పొరపాటు. అలా చేయడం వల్ల మెదడుకు జరిగిన నష్టాన్ని పూడ్చలేమని నిపుణులు చెబుతున్నారు. మెదడు సరైన రీతిలో పనిచేయడానికి మంచి నిద్ర చాలా అవసరం. నిద్రపోయే సమయంలోనే మన మెదడు కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, జ్ఞాపకాలను క్రమబద్ధీకరించడం, కణాలను పునరుద్ధరించడం, మానసిక స్థితిని నియంత్రించడం, రోజంతా పేరుకుపోయిన టాక్సిన్లను బయటకు పంపే పనులను పూర్తి చేస్తుంది.

36
స్క్రోలింగ్ నిద్రను ఎలా పాడు చేస్తుంది?

• మెదడుపై మితిమీరిన ఒత్తిడి: నిద్రపోయే సమయంలో కూడా మెసేజ్లు పంపడం, వీడియోలు చూడటం వల్ల మెదడు విశ్రాంతి తీసుకోలేదు. ఫలితంగా అది నిరంతరం ఉత్తేజితమవుతూనే ఉంటుంది.

• మెలటోనిన్ లోపం: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ శరీరంలో నిద్రకు సహాయపడే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.

• బాడీ క్లాక్ దెబ్బతినడం: రాత్రి సమయంలో శరీరం సహజంగానే విశ్రాంతి స్థితిలోకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఈ బ్లూ లైట్ మెదడును నిరంతరం అలర్ట్‌గా ఉంచుతుంది. దీనివల్ల మీరు ఎనిమిది గంటలు నిద్రపోయినా కూడా ఉదయం లేవగానే అలసట, అసౌకర్యంగానే అనిపిస్తుంది.

46
నిద్రలేమి మెదడును ఎలా దెబ్బతీస్తుంది?

1. జ్ఞాపకశక్తి, తెలివితేటలపై ప్రభావం: విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గుతుంది. ఏదైనా విషయంపై దృష్టి పెట్టడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం నెమ్మదిస్తాయి. ఇది మీ చదువు, ఉద్యోగ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

2. భావోద్వేగాలలో మార్పులు: మానసిక స్థితిని నియంత్రించడం కష్టమవుతుంది. కోపం, ఆందోళన, అనవసరమైన మానసిక ఒత్తిడి పెరుగుతాయి. అలాగే బ్రెయిన్ ఫాగ్ అంటే ఆలోచనల్లో స్పష్టత లేని పరిస్థితి ఏర్పడుతుంది.

3. శారీరక సమస్యలు: తలనొప్పి పెరుగుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ ఉన్నవారికి ఆ లక్షణాలు మరింత తీవ్రంగా మారతాయి.

56
మీ నిద్రను ఫోన్ వాడకం పాడు చేసిందా? ఈ లక్షణాలు చూడండి

మీకు ఈ కింద పేర్కొన్న లక్షణాలు ఉన్నాయో లేదో ఒకసారి సరిచూసుకోండి:

• తీవ్రమైన అలసటగా ఉన్నప్పటికీ నిద్ర పట్టకపోవడం

• రాత్రి వేళల్లో పదే పదే నిద్ర నుంచి మేల్కోవడం

• ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఉత్సాహం లేకపోవడం

• ఉదయం పూట తలనొప్పిగా అనిపించడం

• ఏకాగ్రత లోపించడం, తరచూ మరచిపోవడం

• పగటిపూట పనిలో ఉత్పాదకత లేదా సామర్థ్యం తగ్గడం

• సడన్‌గా కోపం రావడమే కాకుండా తీవ్ర ఆందోళన కలగడం

• పగటి సమయంలో విపరీతంగా నిద్రరావడం

66
నిపుణుల సలహా ఎప్పుడు తీసుకోవాలి?

పైన పేర్కొన్న లక్షణాలు గనుక మీకు వారాల పాటు వరుసగా కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయవద్దు. సరైన వైద్య సలహాలు, చికిత్స కోసం వెంటనే ఒక న్యూరాలజిస్ట్ లేదా స్లీప్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం చాలా అత్యవసరం.

Read more Photos on
click me!

Recommended Stories