AIతో మోటు-పత్లు వైరల్ వీడియోలు ఎలా తయారు చేయాలి..? స్టెప్ బై స్టెప్ పూర్తి వివ‌రాలు

Published : Aug 02, 2026, 10:28 AM IST

AI Video: మోటు, పత్లు పాత్రలు మాట్లాడుతున్నట్లుగా కనిపించే AI వీడియోలు వైరల్ అవుతున్నాయి. షాపుల ముందు నిలబడి సంభాషించడం, గ్రామాల్లో తిరగడం వంటి ఎన్నో వీడియోలు ట్రెండ్ అవ‌తున్నాయి. ఇంత‌కీ వీడియోలు ఎలా త‌యారు చేయాలో తెలుసా.?

PREV
15
ముందుగా AI ఫొటోను సిద్ధం చేసుకోండి

నిజానికి ఇలాంటి వీడియోలను తయారు చేయడం అంత కష్టమైన పని కాదు. ChatGPT సహాయంతో ఫొటో, వీడియో ప్రాంప్ట్ సిద్ధం చేసుకుని, Google Flow ద్వారా కొన్ని నిమిషాల్లోనే వీడియో రూపొందించవచ్చు. ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. 

ఈ ప్రక్రియలో మొదటి దశ మోటు, పత్లు ఫొటోను తయారు చేయడం. దీనికోసం ముందుగా ChatGPT ఓపెన్ చేయండి. తర్వాత మీకు కావాల్సిన సీన్‌ను వివరిస్తూ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఉదాహరణకు ఈ ప్రాంప్ట్ ఉపయోగించవచ్చు.

Create image aspect ratio 9:16 The 3d cartoon character motu and patlu, visited in a town. They are standing in front of a cloth shop. There is a board behind them with "Ramesh Mobiles" written on it. Motu and Patlu standing with normal face expressions.

ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మీకు నచ్చిన ప్రదేశం, షాప్, బ్యాక్‌గ్రౌండ్ లేదా సన్నివేశాన్ని కూడా ప్రాంప్ట్‌లో ఇవ్వొచ్చు. కొన్ని క్షణాల్లోనే AI మీకు ఒక 9:16 ఫొటోను రూపొందిస్తుంది.

25
వీడియోకు కావాల్సిన డైలాగ్స్, వీడియో ప్రాంప్ట్ సిద్ధం చేయండి

ఫొటో సిద్ధమైన తర్వాత దాన్ని మీ మొబైల్‌లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో మోటు, పత్లు ఏం మాట్లాడాలో నిర్ణయించాలి. ఉదాహరణకు "రమేష్ మొబైల్స్" షాప్ గురించి ఇద్దరూ మాట్లాడుకుంటున్నట్లు చిన్న సంభాషణను తెలుగులో రాసుకోవచ్చు. ఆ డైలాగ్‌లను మళ్లీ ChatGPTలో పేస్ట్ చేసి... "ఈ డైలాగ్స్‌తో Google Flow కోసం వీడియో ప్రాంప్ట్ ఇవ్వండి" అని అడగండి. వెంటనే ChatGPT మీ డైలాగ్‌లకు సరిపోయే పూర్తి వీడియో ప్రాంప్ట్‌ను తయారు చేసి ఇస్తుంది. ఆ ప్రాంప్ట్‌ను కాపీ చేసుకుని పెట్టుకోండి.

సూచన: Google Flow ఫ్రీ వెర్షన్‌లో గరిష్ఠంగా 10 సెకండ్ల వీడియో మాత్రమే రూపొందించవచ్చు. కాబట్టి డైలాగ్స్ కూడా 10 సెకండ్లలో పూర్తయ్యేలా చిన్నవిగా ఉండాలి.

35
Google Flowలో కొత్త ప్రాజెక్ట్

ఇప్పుడు గూగుల్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్‌లో Google Flow Lab అని సెర్చ్ చేయండి. వచ్చిన మొదటి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి మీ Gmail అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత... New Project పై క్లిక్ చేయండి. తర్వాత కనిపించే + (ప్లస్) బటన్‌ను ఎంచుకోండి. మీరు ముందుగా సేవ్ చేసుకున్న మోటు, పత్లు AI ఫొటోను అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు మీ వీడియో తయారీకి కావాల్సిన సెటప్ పూర్తవుతుంది.

45
వీడియో ప్రాంప్ట్ పేస్ట్ చేసి సెట్టింగ్స్ ఎంపిక చేయండి

ఫొటో అప్‌లోడ్ చేసిన తర్వాత... ముందుగా ChatGPT నుంచి కాపీ చేసుకున్న వీడియో ప్రాంప్ట్‌ను అక్కడ పేస్ట్ చేయండి. అనంతరం వీడియో సెట్టింగ్స్‌లో Video Ingredients ఆప్షన్‌ను ఎంచుకోండి. వీడియో రేషియోను 9:16గా సెలెక్ట్ చేయండి. వీడియో నిడివిని 10 Secondsగా ఎంపిక చేయండి. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో మరోసారి చూసుకుని Generate లేదా Send బటన్‌పై క్లిక్ చేయండి. కొద్దిసేపట్లో AI మీరు ఇచ్చిన డైలాగ్స్‌తో మోటు, పత్లు మాట్లాడుతున్నట్లుగా వీడియోను రూపొందిస్తుంది.

55
వీడియోను డౌన్‌లోడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి

వీడియో సిద్ధమైన తర్వాత దాన్ని ప్రివ్యూ చూసి సంతృప్తిగా అనిపిస్తే డౌన్‌లోడ్‌ ఆప్షన్ ద్వారా మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో సేవ్ చేసుకోండి. అంతే... ఇప్పుడు మీ వీడియోను యూట్యూబ్ షార్ట్స్‌, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్ స్టేట‌స్‌, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయొచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మోటు, పత్లు వంటి కార్టూన్ పాత్రలు కాపీరైట్ రక్షణలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటిని వ్యక్తిగత వినోదం లేదా ప్రయోగాల కోసం ఉపయోగించడం మంచిది. వాణిజ్యపరమైన ఉపయోగం లేదా బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించే ముందు సంబంధిత హక్కులు, అనుమతుల గురించి తెలుసుకోవడం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories