
సిటీలో ఎండలు ఇప్పటికీ దంచికొడుతున్నాయి. ఉక్కపోత, వర్క్ ప్రెజర్‌తో మైండ్ బ్లాక్ అవుతుంటే.. కాసేపు అలా ప్రశాంతమైన హిల్ స్టేషన్‌కు వెళ్లి చిల్ అవ్వాలనిపించడం కామన్. మీకూ అలాగే ఉందా? అయితే మీ కోసమే ఐఆర్‌సీటీసీ (IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఒక సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది.
"అల్టిమేట్ ఊటీ - ఎక్స్ హైదరాబాద్" పేరుతో సరికొత్త టూర్ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. ప్రతి మంగళవారం సికింద్రాబాద్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. 5 రాత్రులు, 6 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో మీరు ఊటీ అందాలను, కూనూర్ లోయలను మనసారా ఆస్వాదించవచ్చు.
ఈ ట్రిప్ ఎలా సాగుతుందో ఏ రోజు ఎక్కడికి వెళ్తామో అనే వివరాలు గమనిస్తే..
ఈ ప్యాకేజీ తీసుకుంటే మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ట్రైన్ టికెట్లు, కోయంబత్తూర్ నుంచి ఊటీకి షేరింగ్ బేసిస్‌పై ఏసీ వెహికల్ ట్రాన్స్‌పోర్ట్, ఊటీలో 3 రాత్రులు నాన్ ఏసీ హోటల్ స్టే, అలాగే 3 రోజులు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్, జీఎస్టీ అన్నీ ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి.
కానీ, ట్రైన్ లో ఫుడ్, ఊటీలో మధ్యాహ్నం, రాత్రి భోజనం ఖర్చులు మీవే. దాంతో పాటు పర్యాటక ప్రాంతాల ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్ రైడింగ్ లాంటి పర్సనల్ యాక్టివిటీస్ ఖర్చులు మీరే పెట్టుకోవాలి. రూమ్‌లో ముగ్గురు ఉంటే ఎక్స్‌ట్రా మ్యాట్రెస్ ఇస్తారు.
ఈ ప్యాకేజీ ధరలు జూలై 30 నుంచి సెప్టెంబర్ 22 మధ్య ప్రయాణించే వారికి వర్తిస్తాయి. మీరు ఎంచుకునే క్లాస్, షేరింగ్‌ని బట్టి రేట్లు మారుతుంటాయి. మొదటగా కంఫర్ట్ (3AC) క్లాస్ విషయానికి వస్తే.. సింగిల్ షేరింగ్ ₹28,730 చొప్పున, ఇద్దరు కలిసి రూమ్ పంచుకుంటే ఒక్కొక్కరికి ₹16,460 చొప్పున, అలాగే ముగ్గురు కలిసి ఉంటే ఒక్కొక్కరికి ₹15,550 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఇక 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లల కోసం బెడ్ కావాలనుకుంటే ₹8,840, బెడ్ అవసరం లేదు అనుకుంటే ₹6,490 చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు తక్కువ బడ్జెట్‌లో వెళ్లాలనుకునే వారి కోసం స్టాండర్డ్ క్లాస్ అందుబాటులో ఉంది. ఇందులో సింగిల్ షేరింగ్ ధర ₹26,190 కాగా, ట్విన్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి ₹13,920, ట్రిపుల్ షేరింగ్‌కు ఒక్కొక్కరికి ₹13,010 గా నిర్ణయించారు. ఇందులో పిల్లల (5-11 ఏళ్లు) విషయానికి వస్తే బెడ్‌తో కలిపి ₹6,300, బెడ్ లేకుండా కేవలం ₹3,950 గా ఉంది. కాబట్టి సింగిల్ గా వెళ్లే దానికంటే ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో గ్రూప్‌గా వెళ్తే ఈ ట్రిప్ మరింత తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయవచ్చు.
టికెట్ బుక్ చేసుకున్నాక ఏవైనా కారణాల వల్ల క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే, ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్ ([www.irctctourism.com](https://www.irctctourism.com)) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో చేయాలి. రైల్వే కౌంటర్లలో ఇది కుదరదు. ట్రిప్ స్టార్ట్ అవ్వడానికి 15 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాసింజర్‌కు ₹250 మాత్రమే కట్ అవుతుంది. అదే 8-14 రోజుల ముందు అయితే 25%, 4-7 రోజుల ముందు అయితే 50% డబ్బులు కట్ అవుతాయి.
జర్నీకి 4 రోజుల కన్నా తక్కువ టైం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా రీఫండ్ రాదు.
మరిన్ని వివరాలు లేదా బుకింగ్ కోసం సికింద్రాబాద్ లోని ఆక్స్ ఫర్డ్ ప్లాజా, ఎస్.డి. రోడ్డులో ఉన్న ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు. లేదా 8287932229, 9701360701 మొబైల్ నంబర్లకు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.