- శరీరం నుండి బయటకు రావడం
చాలామంది తాము పడుకున్న బెడ్‌ను, తమకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్లను పైనుంచి చూసినట్లు చెబుతారు. ఉదాహరణకు హార్ట్ సర్జరీ టైంలో స్పృహలో లేని చాలామంది పేషెంట్లు, తమ శరీరాన్ని వదిలి బయటకు వచ్చి, రూమ్‌లో జరిగిన సంభాషణలను కరెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి.
2. చావు భయం పోవడం
మరణం అంచులకు వెళ్లొచ్చిన వాళ్లు చావును ఒక 'ముగింపు'గా కాకుండా ఒక 'మార్పు' లేదా 'విముక్తి'గా చూస్తారు. లీండా ప్రింగిల్ అనే మహిళ అనారోగ్యంతో ఉన్నప్పుడు తన శరీరం నుంచి బయటకు తేలుతున్నట్లు, ఒక విశ్వవ్యాప్తమైన ప్రేమను ఫీలైనట్లు వివరించారు.
3. వర్ణించలేని ప్రశాంతత, వెలుగు
చాలామందికి ఈ అనుభవం ఒక దైవికమైన ప్రశాంతతను, భయం లేని స్థితిని ఇస్తుంది. టామీ మెక్‌డొవెల్ అనే మాజీ సైనికుడు తీవ్ర అనారోగ్యం టైంలో తాను చూసిన 'వెలుగు నిండిన ప్రపంచం' తన బాధలను కడిగేసిందని ఎమోషనల్‌గా చెప్పారు.
4. లైఫ్ రీప్లే
కొందరు తమ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒకే క్షణంలో మెరుపు వేగంతో కళ్ల ముందు కనిపించాయని చెబుతారు. ఇది వాళ్లను ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తుంది.
5. స్పోర్ట్స్ ప్లేయర్ల అనుభవం
మోటోజీపీ (MotoGP) రేసర్ జార్జ్ మార్టిన్ ఒక యాక్సిడెంట్ తర్వాత తనకు కలిగిన అనుభవాన్ని ఇలా చెప్పారు. "నేను చనిపోతున్నానని నాకు అర్థమైంది. ఈ ప్రపంచం నుంచి వేరే ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ కలిగింది."
6. చనిపోయిన బంధువులను కలవడం
చాలా స్టడీస్‌లో చనిపోయిన తమ ఆత్మీయులు తమను ఆహ్వానించడానికి వచ్చినట్లు లేదా "నీ టైం ఇంకా రాలేదు, వెనక్కి వెళ్లు" అని చెప్పినట్లు కథలున్నాయి.