Intresting facts: మన భావోద్వేగాలు మనం ముఖంపై కనిపిస్తాయి. కోపంగా ఉన్నా సంతోషంగా ఉన్నా వెంటనే ముఖంలో తెలిసిపోతుంది. అయితే సిగ్గుపడినప్పుడు ముఖం ఎర్రగా మారడం గమనించే ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.?
ఎవరైనా ప్రశంసించినా, లేదా జనాల ముందు చిన్న తప్పు జరిగినా.. ఆ క్షణంలో మన బుగ్గలు ఎర్రబడిపోతాయి, గుండె వేగం పెరుగుతుంది, చెవులు వేడెక్కుతాయి. ఇది మనం నియంత్రించలేని ప్రతిచర్య. ఈ మార్పు ఒక సహజ శారీరక ప్రతిస్పందన, ఇది మానవ మెదడు నుంచి వచ్చే ఆటోమేటిక్ సంకేతాల ఫలితం.
25
అడ్రిలిన్ హార్మోన్
సిగ్గు, భయం, ఉత్సాహం లేదా ఒత్తిడి వంటి భావోద్వేగాల సమయంలో మన మెదడు అడ్రినలిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ మన శరీరాన్ని “Fight or Flight”.. అంటే పోరాడాలా లేదా పారిపోవాలా అనే ప్రతిస్పందనకు సిద్ధం చేస్తుంది. అడ్రినలిన్ శరీరమంతా వ్యాపించి, ముఖ్యంగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది.
35
రక్తనాళాల విస్తరణతో ముఖం ఎర్రగా మారుతుంది
అడ్రినలిన్ ప్రభావం వల్ల చర్మం కింద ఉన్న రక్తనాళాలు విస్తరిస్తాయి (వెడల్పవుతాయి). దాంతో రక్తప్రవాహం ఒక్కసారిగా పెరుగుతుంది. ముఖం, మెడ, చెవులు వంటి చోట్ల చర్మం పలుచగా ఉండటంతో ఆ రక్తప్రవాహం సులభంగా కనిపిస్తుంది. అదే కారణంగా మన ముఖం తక్షణమే ఎర్రగా మారుతుంది. ఇది పూర్తిగా అసంకల్పిత ప్రతిచర్య. అంటే ఇందులో మన ప్రమేయం ఏమాత్రం ఉండదు.
రక్తం ఆక్సిజన్‌తో నిండినప్పుడు అది లేత ఎరుపు రంగులో ఉంటుంది. సిగ్గుపడినప్పుడు రక్తప్రవాహం పెరిగి, ఆక్సిజన్‌తో కూడిన రక్తం ముఖంలోని కేశనాళికలను నింపుతుంది. అదే చర్మం ద్వారా ప్రతిబింబమై మనకు ఎర్రదనంగా కనిపిస్తుంది. మన చర్మం మందంగా ఉంటే లేదా రక్తప్రవాహం తక్కువగా ఉంటే, ఈ ఎరుపు అంతగా కనిపించదు.
55
మానవులకే ప్రత్యేకమైన ప్రతిచర్య
ఈ విధమైన “సిగ్గు ప్రతిస్పందన” మానవులలో మాత్రమే కనిపిస్తుంది. జంతువుల్లో ఇది జరగదు. ముఖం ఎర్రబారడం అనేది మన భావోద్వేగాలను బహిరంగంగా చూపించే సహజ ప్రతిస్పందన.