Motivational story: ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది ఏదీ అంటే వెంటనే వజ్రం, బంగారం.. ఇలా రకరకాల సమాధానాలు చెబుతుంటాం. అయితే ఈ కథ చదివితే అన్నింటికంటే విలువైంది సమయమని మీకు అర్థమవుతుంది.
ఒక రోజు ఉదయం మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 86,400 జమ అయిందని ఊహించుకోండి. ఆ డబ్బు మీకు ఆ రోజు మాత్రమే ఉంటుంది. మీరు దానిని ఉపయోగించకపోతే, రాత్రికి జీరో అవుతుంది. మిగిలిన మొత్తాన్ని మీరు మరుసటి రోజున ఉపయోగించుకోలేరు. అలాంటప్పుడు మీరు ఏమి చేస్తారు? ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా ప్రతి రోజూ మొత్తం ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు కదా?
25
మనందరికీ అలాంటి బ్యాంక్ ఉంది
నిజానికి మనందరికీ ఇలాంటి ఓ బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ పేరు టైమ్. ప్రతి రోజు ఉదయం మనందరికీ 86,400 సెకన్లు లభిస్తాయి. అంటే 24 గంటలు. ఆ సమయాన్ని ఎలా ఉపయోగిస్తామన్నది మన చేతిలో ఉంటుంది. రాత్రి నిద్రకు వెళ్లే సమయానికి మీరు ఆ రోజు వృథా చేసిన సెకన్లు తిరిగి రావు. అవి శాశ్వతంగా పోతాయి.
35
అప్పుగా ఇవ్వలేరు, తిరిగి పొందలేరు
సమయానికి అప్పు అనే వ్యవస్థ లేదు. మీరు రేపటి సమయాన్ని ముందుగానే తీసుకోలేరు, నిన్నటి సమయాన్ని తిరిగి పొందలేరు. మీకు లభించిన సమయం అంతే.. దానిని మీరు ఎలా వినియోగిస్తారో మీ నిర్ణయం. కాబట్టి ప్రతి రోజూ మీ "సమయ అకౌంట్" ను జాగ్రత్తగా వాడాలి.
డబ్బు ఖర్చు చేసే ముందు మనం ఆలోచిస్తాం.. ఇది అవసరమా? విలువైనదా? అలాగే సమయాన్నీ అలా చూసుకోవాలి. ఫోన్‌లో, సోషల్ మీడియాలో, వ్యర్థపు మాటల్లో సమయం పోతుంది కానీ మన లక్ష్యాలకు మాత్రం సమయం ఇవ్వడం మరిచిపోతాం. ఇది మన జీవితాన్ని నెమ్మదిగా ఖాళీ చేస్తుంది.
55
ప్రతి సెకన్ విలువైనది
సమయం డబ్బుకన్నా విలువైనది. డబ్బు పోయినా తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయం ఒక్కసారి పోయిందంటే తిరిగి రాదు. కాబట్టి ప్రతి రోజు ఉదయం మీరు కొత్తగా 86,400 సెకన్లు పొందుతున్నారని గుర్తుంచుకోండి. వాటిని మీ కుటుంబం, ఆరోగ్యం, అభివృద్ధి, కలల కోసం ఉపయోగించండి.