Moral Story: నోరు ఉంది కదా అని అందరికీ సలహాలు ఇస్తే, ఫలితం ఇలానే ఉంటుంది..!

Published : Oct 24, 2025, 05:33 PM IST

Moral Story:  మనలో చాలా మందికి అత్యుత్సాహం ఉంటుంది. సంబంధం లేని విషయాల్లో తల దూర్చి మరీ సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు. వారు సమస్యల్లో పడటమే కాదు.. తమ వారందరినీ సమస్యల్లో పడేస్తారు. ఈ విషయం పూర్తిగా అర్థం అవ్వాలంటే.... ఈ కాకి కథ చదవాల్సిందే. 

PREV
14
పక్షుల రాజు

పూర్వం పక్షులన్నింటికీ గరుడ అనే ఓ గ్రద్ద రాజుగా ఉండేది. గరుడ చాలా బలవంతుడు. తెలివైన వాడు. దేవతల వాహనం కూడా. కానీ కొంతకాలంగా పక్షుల సమస్యలు, కష్టాలను పట్టించుకోవడం మానేశాడు. ఎవరి మాట వినేవాడు కూడా కాదు. దీంతో... అన్ని పక్షుల్లో అసంతృప్తి మొదలైంది. కొత్త రాజును నియమించుకోవాలి అని పక్షులు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, ఎవరిని రాజుగా ఎంచుకోవాలో తేల్చుకోవడానికి ఓ పెద్ద సభను ఏర్పాటు చేసుకున్నాయి.

24
కొత్త రాజుగా గుడ్ల గూబ

పావురాలు, కోయిలలు, రామ చిలుకలు, పిచుకలు, మైనా లు, కొంగలు అన్ని రకాల పక్షులు వచ్చాయి. కానీ, కాకులు మాత్రం రాలేదు. చాలా సేపు కాకుల కోసం ఎదురు చూశాయి. అవి రాకపోవడంతో.. మిగిలిన పక్షులన్నీ మీటింగ్ మొదలుపెట్టాయి. చాలా మంది పక్షులు గుడ్ల గూబ కొత్త రాజు అయితే బాగుంటుందని నిర్ణయించాయి.

‘ గుడ్ల గూబ చాలా తెలివైనది. రాత్రి పూట కూడా చూడగలదు. మనందరినీ కాపాడగలదు’ అని ఓ రామ చిలుక చెప్పింది. మిగిలిన పక్షులన్నీ నిజమే.. మాకు కూడా ఒకే అని ఒప్పుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో కాకుల పెద్ద అడుగుపెట్టింది. కాకులన్నింటి తరుపున వచ్చిన కాకి అది. వచ్చీ రాగానే.. మీటింగ్ లో ఏం తేల్చారు అని ఇతర పక్షులను అడిగింది. దీంతో.... తాము గుడ్ల గూబను రాజుగా ఎన్నుకున్నామనే విషయాన్ని కాకి కి చెప్పాయి.

34
హేళన చేసిన కాకి..

దానికి కాకి వెంటనే నవ్వడం మొదలుపెట్టింది. ఎందుకు నవ్వుతున్నావు అని ఇతర పక్షులు అడగగా.. ‘ గుడ్ల గూబ కు రాత్రి మాత్రమే కళ్లు పని చేస్తాయి. పగలు కనిపించవు. కదా.. మీకు రాజు కావాలా? నైట్ వాచ్ మెన్ కావాలా? అయినా రాజు అంటే ఎంత అందంగా ఉండాలి? కొంగ, రామ చిలుక చూడటానికి ఎంత బాగుంటాయి? వాటిని వదిలేసి ఈ గుడ్ల గూబను రాజు చేస్తారా?’ అని నవ్వుతుంది. ఈ మాటలు విన్న మిగిలిన పక్షులు నిజమే కదా... రాత్రి మాత్రమే కళ్లు కనపడే గుడ్ల గూబను రాజు చేయడం వల్ల ఉపయోగం ఏముంది అని ఆ కార్యక్రమాన్ని అక్కడితో ఆపేస్తాయి. మరోసారి ఈ విషయం మీద మీటింగ్ పెట్టుకుందాం అని పక్షులన్నీ వెళ్లిపోతాయి.

అయితే, తనకు దక్కాలన్సిన గౌరవం కాకి కారణంగా పోవడంతో.... గుడ్ల గూబకు చాలా కోపం వస్తుంది. దీంతో... కాకికి వార్నింగ్ ఇస్తుంది. నీ వల్ల నా గౌరవం పోయింది.. ఇక నుంచి నువ్వే నా శత్రువు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయిందట. అప్పటి నుంచి కాకులు, గూడ్ల గూబలు శత్రువులుగా మారిపోయాయి.

44
కథలో నీతి...

ఇదంతా జరగడంతో కాకి ఆలోచనలో పడింది. ‘ అసలు రాజుగా ఎవరు ఎన్నికైనా.. నాకు ఒరిగేది ఏమీ లేదు. ఏ రాజు నాకు వచ్చి చేసే సహాయం ఏమీ లేదు కదా, నేను అసలు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నాను..? నాతో పాటు నా జాతి మొత్తానికి శత్రువులను తెచ్చి పెట్టానే’ అని తర్వాత ఫీలౌంది. అందుకే... తొందరపడి మాట్లాడకూడదు. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించాలి. మనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడితే.... నష్టం మనకే కలుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories