వయసుతో పనిలేదు ఆయన అడిగితే ఇప్పుడైనా సిద్ధమే... చిన్నారి పెళ్లికూతురు అవికా బోల్డ్ కామెంట్!

First Published May 21, 2021, 10:11 AM IST

సీరియల్స్ లో బాలికావధు ఓ సంచలనం. ఆ సీరియల్ లో టైటిల్ రోల్ చేసిన అవికా గోర్ అంతే స్థాయిలో ఫేమస్ అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అవికా గోర్,టీనేజ్ రాగానే హీరోయిన్ గా మారారు. 
 

అక్కినేని నాగార్జున నిర్మాతగా తెరకెక్కిన ఉయ్యాలా జంపాలా మూవీతో అవికా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. రాజ్ తరుణ్ డెబ్యూ మూవీగా తెరకెక్కిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
undefined
తెలుగులో ఆమె నటించిన సినిమా చూపిస్త మావా, ఎక్కడిపోతావు చిన్నవాడా హిట్ చిత్రాలుగా నిలిచాయి. కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో అవికా గౌర్ పర్సనల్ ప్రాబ్లెమ్స్ కారణంగా గ్యాప్ తీసుకున్నారు. కొందరిపై వేధింపుల ఆరోపణలు కూడా ఆమె చేయడం జరిగింది.
undefined
కెరీర్ పరంగా సో సో గా ఉంది అవికా పరిస్థితి. అయితే ఆమె లవ్ స్టోరీ మాత్రం కిక్ పంచుతుంది. గత ఏడాది హైదరాబాద్ కి చెందిన మిలింద్ చాంద్వాని అనే వ్యక్తిని తన లవర్ గా పరిచయం చేసి, ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తనకు లైఫ్ పార్టనర్ దొరికాడని అతనితో ఎఫైర్ అధికారికంగా ప్రకటించింది.
undefined
దీనితో తాజా ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడుగగా ఆసక్తికర సమాధానాలు చెప్పింది. తన లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ.. ఓ ఎన్జీఓ ఈవెంట్ లో పాల్గొన్న సమయంలో మిలింద్ తో పరిచయం ఏర్పడింది.
undefined
అయితే మాది లవ్ యట్ ఫస్ట్ సైట్ కాదు. ఒకరిని ఒకరం అర్థం చేసుకున్నాక, లవ్ ప్రపోజ్ చేసుకున్నాం. దక్షిణాది ప్రేమ చిత్రాల వలె మా కథ ఉంటుందని అవికా గోర్ తెలిపారు. మిలింద్ ఓ ఎన్జిఓ నడుపుతుండడం విశేషం.
undefined
ఇక పెళ్లి విషయానికి వస్తే పెళ్లి చేసుకునే వయసుకు నాకు ఇంకా రాలేదు. కానీ మిలింద్ పెళ్లి చేసుకుందాం అంటే నేను ఇప్పుడైనా సిద్దంగానే ఉన్నాను. పెళ్లి నిర్ణయం ఆయనదే అన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చింది అవికా గోర్.
undefined
ప్రస్తుతం అవికా ఏజ్ 23, అంటే పెళ్లీడు వచ్చినట్లే. కాకపోతే గ్లామర్ ఫీల్డ్ లో 30దాటినా కూడా హీరోయిన్స్ పెళ్లిమాట ఎత్తరు. అదే సూత్రాన్ని అవికా గోర్ ఫాలో అవుతున్నారు.
undefined
టాలీవుడ్ లో అవికాకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ జంటగా ఓ మూవీ చేస్తున్నట్లు సమాచారం. అలాగే నాగ చైతన్యకు జంటగా మరో చిత్రం చేస్తున్నారని వినికిడి.
undefined
click me!