Ennenno Janmala Bandham: మాళవికకు ధైర్యం చెప్పిన అభి.. వేద, యష్ మధ్య రొమాంటిక్ సీన్?

First Published Feb 3, 2023, 12:37 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఫిబ్రవరి 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో వేద యష్ ని భోజనం తినడానికి పిలుచుకొని వెళ్లగా అప్పుడు ఆకలి అవుతున్నా కూడా లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉండగా అవునా సరే అని నవ్వుతూ ఉంటుంది వేద. నువ్వు తిన్నావా లేదా అనగా లేదు అనడంతో సర్లే నువ్వు కూర్చొని వడ్డిస్తాను అని వేదని కూర్చోబెట్టి భోజనం వడ్డీస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిని వెళ్లి పడుకుంటారు. అప్పుడు వేదని చూస్తూ వేదతో గడిపిన క్షణాలు గుర్తుతెచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. మరొకవైపు మాళవిక ఒకచోట కూర్చుని భ్రమరాంబిక అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి అభి వస్తాడు. బంగారం ఏమైంది బంగారం అనడంతో నన్ను చంపేయ్ డార్లింగ్.

నేను నీ పెళ్ళాం అవడం కోసం పిల్లల్ని భర్తని వదిలేసాను అని ఏడుస్తూ మాట్లాడుతుంది మాళవిక. నీ కోసం అన్ని వదులుకున్నప్పుడు నీకోసం నా ప్రాణం అయినా వదిలేస్తాను నన్ను చంపెయ్ అభి. నీ చేతులతో తాళి కట్టినప్పుడు అదే చేతులతో గొంతు పిసికి చంపేయ్ అని అంటుంది. చంపడానికే నేను రెడీ నేను నీకు నాకు మధ్య ఎవరైనా వస్తే, చావడానికి అయినా రెడీ నేను నీతో జీవితం పంచుకోకపోతే అంటాడు అభి. అప్పుడు నువ్వేం టెన్షన్ పడకు ఈ అభిని తక్కువ అంచనా వేయకు అని మాళవికకు ధైర్యం చెబుతాడు.  ఆ తర్వాత యష్ యోగ చేస్తూ ఉండగా అప్పుడు వేద ఖుషికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. అప్పుడు యష్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది.
 

అప్పుడు యష్ ఇంత పొద్దున్నే వేద ఫోన్ మోగుతోంది. ఇంత పొద్దున్నే ఆ విన్ని గాడే ఫోన్ చేస్తూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు పదేపదే ఫోన్ రింగ్ అవుతూ ఉండగా వేద రాకపోవడంతో చిరాకు పడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. అప్పుడు విన్నీ ఫోన్ చేయడంతో చెప్పు విన్నీ అనగా యష్ కుళ్ళు కుంటూ ఉంటాడు. సరే విన్నీ పార్టీకి నేను మా ఆయన ఇద్దరం వస్తాము అని చెప్పి వేద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత కొరియర్ బాయ్ వచ్చి మేడం చికెన్ బిర్యాని అనడంతో సులోచన చి చి దూరం అని అంటుంది. ఇంతలోనే మాలిని అక్కడికి వచ్చి బిర్యానీ ఆర్డర్ చేసింది నేను అని అంటుంది.

అప్పుడు వాళ్ళిద్దరూ బిర్యాని విషయంలో ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఖుషి మళ్లీ మొదలుపెట్టారు హాలిడే రోజు కూడా ప్రశాంతంగా ఆడుకొనివ్వరు అని అంటుంది. అప్పుడు ఎలా అయినా వాళ్ళిద్దరి గొడవను ఆపాలి అని కావాలని జుట్టు విరబోసుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఖుషి జడ నేను వేస్తాను నేను వేస్తాను అని పోటీపడి ఇద్దరు ఒక్కొక్క జడ ఒక్కొక్క లాగా వేస్తారు. ఇప్పుడు చెప్పు ఖుషి ఎవరి జడ బాగుంది అని అనగా  తాతయ్య వాళ్ళని పిలుస్తాను ఎవరి జడ బాగుందో వాళ్ళే చెప్తారు అని అంటుంది. తర్వాత వర్మ రత్నం ఇద్దరు అక్కడికి వస్తారు. అప్పుడు ఖుషి జడ విషయంలో ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.
 

అప్పుడు సులోచన వర్మ ని లోపలికి పిలుచుకొని వెళ్లగా, మాలిని రత్నం ని లోపలికి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు ఖుషి ఇప్పుడు సంతోషంగా ఆడుకోవచ్చు అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత యష్ మీటింగ్ ఉంది అని తొందర తొందరగా స్నానం చేయడానికి వెళ్ళగా ఇంతలో వేద అక్కడికి వచ్చి నేను భార్యని నేను ఉన్నాను కదా నాకు ఈ పని ఉంది ఈ మీటింగ్ ఉంది అని చెబితే అన్ని నేను అరేంజ్ చేస్తాను కదా అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. వేద కోట్లు చూస్తూ నేను చెప్తే అసలు వినిపించుకోరు ఇంకోటి చాలా బాగుంది అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఈయనకు రివర్స్ ట్రీట్మెంట్ కరెక్ట్ అని తనకు నచ్చినది పక్కన పెట్టి ఇంకొకటి ఇంకొక పక్కన పెడుతుంది. అప్పుడు వేదా ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే చేసే స్నానం చేసి బయటకు వస్తాడు.
 

నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు. ఇది నా బెడ్ రూమ్ అనడంతో నీది కాదు మాత్రమే కాదు నా బెడ్ రూమ్ కూడా అంటుంది వేద. సరే బయటికి వెళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనడంతో మీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను ఇది ఏమీ బాగోలేదు ఇది చాలా బాగుంది అంటూ రివర్స్ డ్రామా మొదలు పెడుతుంది వేద. అప్పుడు నీకు ఈ సూట్ నచ్చలేదు కాబట్టి నేను ఇదే వేసుకుంటాను అని అంటాడు యష్. అప్పుడు వేద సాధించాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వేద నవ్వుకుంటూ ఉండగా ఏమైంది ఎందుకు నవ్వుతున్నావు అంటాడు యష్. నాకు ఆ డ్రెస్సే నచ్చింది అందుకే నీ గురించి తెలిసి రివర్స్ డ్రామా మొదలు డ్రామా మొదలు పెట్టాను అనడంతో ఆశ్చర్యంగా చూస్తాడు. సరే సరే కానీ బయటకు వెళ్తే నేను డ్రెస్ వేసుకోవాలి అని అంటాడు. అప్పుడు వేద బయటికి వెళ్తుండగా కింద పడిపోతుండడంతో యష్ పట్టుకుంటాడు. అప్పుడు యష్ నవ్వుకుంటూ అసలు ఏంటో ఈ వేద ఎప్పటికి అర్థం కాదు అనుకోని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.

click me!