కల్కిలో వెంకయ్య నాయుడికి నచ్చిందేంటి? ఈ సినిమాని అంతగా ఎందుకు పొగిడేస్తున్నారు?

First Published Jul 19, 2024, 12:33 AM IST

Kalki 2898 AD: భారతీయ చలన చిత్ర సీమను కల్కి 2829 A.D. ఊపేస్తోంది. ప్రఖ్యాత నటులు ప్రభాస్, అమితాబ్ బచన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే నటించిన ఈ సినిమా రూ.వెయ్యి కోట్ల వసూళ్లు దాటేసింది. తాజాగా ఈ సినిమాను మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వీక్షించారు.

Kalki 2898 AD

కల్కి 2829 ఎ.డి... ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే లాంటి భారీ తారాగణంతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను ఊపేసింది. ఈ ఏడాది భారీ విజయం అందుకు భారతీయ చిత్రం కల్కి 2829 ఎ.డి. అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Kalki 2898 AD

అయితే, బాహుబలి 2 సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్‌ కొట్టడానికి ప్రభాస్‌ చెమటోడ్చాల్సి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ చిత్రాలు వరుసగా స్ట్రగుల్ అయ్యాయి. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ వరుసగా డిజాస్టర్స్ అయి.. ఫ్యాన్స్‌ని నిరాశపర్చాయి. 
 

Latest Videos


Kalki 2898 AD

ఆదిపురుష్ సినిమా అయితే ప్రభాస్ ఇమేజ్‌నే దెబ్బతీసింది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్‌ను చూపించేందుకు దర్శకుడు ఓం రౌత్‌ చేసిన ప్రయత్నం దారుణమైన విమర్శలను మూటగట్టుకుంది. ప్రత్యేకించి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ని దారుణంగా హర్ట్‌ చేసింది. 

Kalki 2898 AD

దారుణమైన డిజాస్టర్ల తర్వాత ప్రభాస్‌ నటించిన కల్కి 2898 ఎ.డి. వాటన్నిటినీ మర్చిపోయేలా చేసింది. ఫ్లాప్‌లను చూసి ప్రభాస్‌ని విమర్శించినవారు ఈ సినిమా గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Kalki 2898 AD

తాజాగా కల్కి 2898 ఎ.డి. సినిమా చేసిన భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు. ఇది హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉందని కొనియాడారు.

Venkaiah Naidu praises Kalki 2898 AD

‘‘నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మించిన కల్కి 2898 ఎ.డి. చలనచిత్రాన్ని ఈరోజు వీక్షించాను. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించింది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణే తదితర భారీ తారాగణంతో రూపొందించిన ఈ చలనచిత్ర నిర్మాణం హాలీవుడ్ నిర్మాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీ దత్ సహా ఈ చలనచిత్ర రూపకల్పనలో పాల్పంచుకున్న  భాగస్వాములందరికీ అభినందనలు.’’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.

click me!