మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్నారు. సంక్రాంతికి రాంచరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు రాంచరణ్ బుచ్చిబాబు చిత్రం కోసం కొత్త మేకోవర్ ట్రై చేస్తున్నారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రాంచరణ్ ఆన్ స్క్రీన్ ఆయినా ఆఫ్ స్క్రీన్ అయినా చాలా మెచ్యూరిటీ తో వ్యవహరించే వ్యక్తి అని ఇండస్ట్రీలో పేరు ఉంది.