పవన్ ని తిట్టిన ప్రకాష్ రాజ్ కి మెగా హీరోలు సప్పోర్ట్ ఎలా ఇస్తున్నారు... భక్తుడు బండ్ల గణేష్ షాకింగ్ ఆన్సర్

First Published Aug 25, 2021, 4:06 PM IST

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కామెంట్స్ తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. పవన్ భక్తుడిగా తన హీరో గురించి ఆయన ఇచ్చే ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగిస్తూ ఉంటాయి. అలాంటి బండ్ల గణేష్ మా ఎన్నికల విషయంలో ప్రకాష్ రాజ్ కి సప్పోర్ట్ గా నిలుచున్నారు.

రెండు నెలల క్రితం మొదలైన మా ఎన్నికల వాతావరణం అనేక వివాదాలకు దాటితీసింది. పరిశ్రమలోని కొందరు నటుల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎన్నికల బరిలో దిగిన ప్రకాష్ రాజ్ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ పనితీరును తప్పుబట్టారు. 27మందితో కూడిన ప్యానెల్ ని ప్రకాష్ రాజ్ ప్రకటించగా అందులో బండ్ల గణేష్, శ్రీకాంత్, జయసుధ, సాయి కుమార్, బెనర్జీ వంటి వారు ఉన్నారు. 
 

కాగా ప్రకాష్ రాజ్ కి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలిపారు. అలాగే అన్నయ్య చిరంజీవి సప్పోర్ట్ కూడా ప్రకాష్ రాజ్ కి ఉందని నాగబాబు ప్రెస్ మీట్ లో బహిరంగంగా తెలియజేయడం జరిగింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ రాజకీయ నిర్ణయాలపై ప్రకాష్ రాజ్ బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల బరిలో బీజేపీకి మద్దతు తెలుపుతూ జనసేన పోటీ నుండి తప్పుకుంది. బీజేపీ కంటే అత్యధిక ఓటు షేర్ కలిగిన జనసేన ఎన్నికల నుండి తప్పుకోవడం బాధాకరం, పవన్ ఈ విషయంలో నన్ను చాలా నిరాశపరిచారని ఓపెన్ కామెంట్ చేశారు. 


ప్రకాష్ రాజ్ కామెంట్స్ పై నాగబాబు ఫైర్ అయ్యారు. షూటింగ్స్ కి సరిగా రాకుండా, నిర్మాతలను ఇబ్బందిపెట్టే ప్రకాష్ రాజ్ కి పవన్ ని విమర్శించే హక్కులేదని గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో నాగబాబు, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. 
 

సీన్ కట్ చేస్తే కొన్ని నెలల తరువాత మా ఎన్నికల విషయంలో ప్రకాష్ కి మద్దతుగా మెగా ఫ్యామిలీ నిలిచింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బండ్ల గణేష్ ని యాంకర్ ఇదే ప్రశ్న అడిగారు. ఒకప్పుడు పవన్ ని విమర్శించిన ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ ఎందుకు మద్దతుగా నిలుస్తుంది అని అడిగారు. 
 

అప్పట్లో గొడవలు పడిన ప్రకాష్ రాజ్, పవన్ వకీల్ సాబ్ మూవీ సమయంలో రాజీపడ్డారా, పవన్ సప్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచారా అన్న ప్రశ్నకు బండ్ల ఈ విధంగా స్పందించారు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు అంటూ ఆయన ఒక్క మాటతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. 

పవన్ తనకు కెరీర్ ఇస్తే, చిరంజీవి ప్రాణదానం చేశారని గుర్తు చేసుకున్నారు. రెండోసారి కరోనా సోకిన నేను చనిపోవాల్సిన స్థితిలో చిరంజీవికి కాల్ చేస్తే, ఆసుపత్రి బెడ్ ఇప్పించారని, ఒకరోజు ఆలస్యమైనా చనిపోయేవాడిని అని డాక్టర్స్ చెప్పారని బండ్ల గణేష్ తెలియజేశారు. 
 


ఇక మా సభ్యుల మధ్య గొడవలు కేవలం తాత్కాలికం, ఈ ఎన్నికలు ముగిశాక అందరూ కలిసిపోతారు. ప్రకాష్ రాజ్ వ్యక్తిగతంగా నాకు ఇష్టం అందుకే మద్దతు తెలిపాను, అలా అని నరేష్ సరిగా పని చేయలేదని నేను ఎప్పుడూ చెప్పలేదని బండ్ల గణేష్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 

click me!