పలకరించిన పాపానికి కోటా ముఖంపై ఉమ్మివేసిన బాలయ్య... సీనియర్ నటుడికి తీరని అవమానం

First Published Aug 22, 2021, 4:04 PM IST

ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయనకు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. అలాంటి చిత్రాలలో మండలాధీశుడు కూడా ఒకటి. ఈ మూవీలో కోటా, ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ ప్రధాన పాత్ర చేశారు. ఆ రోల్ చాలా వివాదాస్పదం అయ్యింది. 
 


బాలయ్య మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అందుకే వేదిక ఏదైనా ఆయన చుట్టూ ఉన్నారు కొంచెం అటెన్షన్ లో ఉంటారు. కోపమైనా, సంతోషమైనా పరిసరాలను పట్టించుకోకుండాతీర్చేసుకుంటాడు బాలయ్య. అందుకే ఆయన చర్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. 
 

కాగా సీనియర్ నటుడు కొత్త శ్రీనివాసరావును కూడా బాలయ్య తీవ్ర అవమానానికి గురిచేశాడట. ఏకంగా కాండ్రించి కోటా ముఖం మీదా ఉమ్మి వేశారట బాలకృష్ణ. అప్పటి సంఘట గుర్తుచేసుకుంటూ కోటా ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. 


గతంలో జంధ్యాల మూవీ షూటింగ్ కోసం కోటా రాజమండ్రి వెళ్లారట. అక్కడ ఓ హోటల్ లో లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్న కోటాను చూసిన పరుచూరి బ్రదర్స్ తప్పుకో అంటూ సైగలు చేస్తున్నారట. ఆసమయంలో అటుగా వెళ్తున్న బాలయ్యను చూసిన కోటా.. నమస్కారం బాబుగారు అంటూ పలకరించారట. 

అయితే బాలయ్య ప్రతినమస్కారం పెట్టకపోగా ముఖంపై ఉమ్మి కోపంగా వెళ్లిపోయారట. ఆ సందర్భం చాలా బాధను కలిగించిందని కోటా శ్రీనివాసరావు తెలియజేశారు. బాలయ్య అలా చేయడం వెనుక కారణం కూడా కోటా పంచుకోవడం జరిగింది. 
 


ఎన్టీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయనకు వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. అలాంటి చిత్రాలలో మండలాధీశుడు కూడా ఒకటి. ఈ మూవీలో కోటా, ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ ప్రధాన పాత్ర చేశారు. ఆ రోల్ చాలా వివాదాస్పదం అయ్యింది. 
 


ఎన్టీఆర్ ఇమేజ్ ని దెబ్బతీసేదిగా ఉన్న పాత్ర చేసిన కోటా మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఓ సందర్భంలో కోటాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాడి చేసి గాయపరిచారని కోటా తెలియజేశారు. ఫ్యాన్స్ మాదిరి బాలయ్య కూడా ఆ పాత్ర చేసినందుకు నాపై కోపం పెంచుకున్నట్లు ఉన్నారని కోటా తెలియజేశారు. 

తండ్రి ఇమేజ్ పాడు చేసేలా ఉన్న ఆ పాత్ర చేయడం వలన కొడుకుగా బాలయ్య బాగా ఫీలై అలా చేసి ఉంటాడు. తండ్రిని అంటే కొడుకుకు కోపం రావడం సహజం. పైగా అప్పుడు ఆయన సీఎం కొడుకు మరీ అని కోటా అన్నారు. 

అయితే ఆ పాత్ర చేయడం నా తప్పు కాదు. మేకర్స్ అలా తీర్చిదిద్దారు నేను చేశాను. ఇప్పటికీ ఆ పాత్ర చేసినందుకు నేను బాధపడడం లేదని కోటా సమర్ధించుకున్నారు. అయితే ఆ పాత్ర చేసినందుకు ఎన్టీఆర్ మాత్రం తనను మెచ్చుకున్నారని కోటా చెప్పడం గమనార్హం.

click me!