'కశ్మీర్ ఫైల్స్' ఫాసిస్ట్ మూవీ, అక్కసు వెళ్లగక్కిన నడవ్ లాపిడ్.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన వివేక్ అగ్నిహోత్రి 

First Published Dec 1, 2022, 4:13 PM IST

కశ్మీర్ ఫైల్స్ చిత్ర సంచలనాలు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు.

కశ్మీర్ ఫైల్స్ చిత్ర సంచలనాలు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరెకెక్కించారు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన కశ్మీర్ ఫైల్స్ ఇండియా వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి సంచలన విజయం అందుకుంది. 

కశ్మీర్ పండిట్లపై జరిగిన హత్యాకాండని కళ్ళకి కట్టినట్లు చూపించారు అంటూ కొందరు ప్రశంసించగా.. ఇది రాజకీయ ప్రేరేపిత చిత్రం అంటూ విమర్శలు కూడా వినిపించాయి. ఈ చిత్రం వెనుక బీజేపీకి రాజకీయ అజెండా ఉందంటూ ఇతర పార్టీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని గోవాలో జరిగిన భారత అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రదర్శించారు. కశ్మీర్ ఫైల్స్ లాంటి చిత్రాన్ని ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడాన్ని ఇజ్రాయెల్ దర్శకుడు, జ్యూరీ అధ్యక్షుడు నడవ్ లిపిడ్ తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.  ఇది వల్గర్ మూవీ, హింసాత్మక చిత్రం. రాజకీయ ప్రేరేపిత కారణాలతోనే ఈ చిత్రం తెరకెక్కినట్లు అనిపిస్తోంది అంటూ నడవ్ లాపిడ్ చేసిన కామెంట్స్ పెను దుమారం రేపుతున్నాయి.

ఆ తర్వాత ఇజ్రాయెల్ మీడియా ముందు కూడా కశ్మీర్ ఫైల్స్ పై నడవ్ తన అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఫాసిస్ట్ లక్షణాలు ఉన్న మూవీ అంటూ అభివర్ణించాడు. దీనితో కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా ధీటుగా స్పందించారు. నడవ్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. 

'ఈ క్రింది వాటిలో కామన్ గా కనిపించేది ఏంటి ? ఇండియా ఫాసిస్ట్ దేశం, మోడీ ఫాసిస్ట్ , బిజెపి ఫాసిస్ట్, హిందూ సంఘాలు ఫాసిస్ట్, ఆర్టికల్ 370 ఎత్తివేయడం ఫాసిస్ట్ చర్య, కశ్మీర్ ని ఆక్రమించింది ఇండియాకి చెందిన ఫాసిస్టులు, కశ్మీర్ ఫైల్స్ మూవీ ఫాసిస్ట్ చిత్రం .. అంటూ వివేక్ అగ్నిహోత్రి పోస్ట్ చేశారు.  యూదులపై దారుణమైన మారణహొహం అనుభవించిన వర్గానికి చెందిన దర్శకుడు ఈ రకంగా మాట్లాడడం సిగ్గు చేటు. యూదులపై జరిగిన మారణ హోమం నిజమైతే.. కశ్మీర్ పండిట్లపై జరిగిన నరమేధం కూడా నిజమే.. ఆయనకి దేవుడు తెలివి ప్రసాదించాలి అని అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. 

అంటే ఇండియా ఏం చేసినా అది ఇతరులకి ఫాసిస్ట్ చర్యగా కనిపిస్తోంది అంటూ వివేక్ అగ్నిహోత్రి నడవ్ ని పరోక్షంగా తప్పు పట్టారు.  నిజాలు చాలా ప్రమాదకరమైనవి.. అవి వ్యక్తుల చేత అబద్దాలు కూడా చెప్పిస్తాయి.. అంటూ వివేక్ ఆల్రెడీ నడవ్ ని ఉద్దేశించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

click me!