DC vs RCB : క్యాచులు వ‌దిలారు.. మ్యాచ్ ఓడిపోయారు.. ఢిల్లీ పై బెంగ‌ళూరు గెలుపు

By Mahesh Rajamoni  |  First Published May 13, 2024, 1:11 AM IST

Royal Challengers Bangalore vs Delhi Capitals : ఐపీఎల్ 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు అవ‌కాశాలు స‌జీవంగా ఉన్నాయి. 
 


DC vs RCB : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో బెంగళూరు 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ ప్లేఆఫ్ అవ‌కాశాలు స‌జీవంగా ఉన్నాయి. 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుంది. త‌ర్వాత ఆడ‌బోయే మ్యాచ్ లో ఆర్సీబీ చెన్నైపై గెలవాల్సి ఉంటుంది. ఇతర జట్ల ఫలితాలు, నెట్ ర‌న్ రేటు ప్లేఆప్స్ రేసులో కీల‌కం కానున్నాయి. మరోవైపు ఢిల్లీ 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉంది. ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే, వారు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించాలి. అప్ప‌టికీ ఇతర జట్ల ఫలితాలపై ఆధార‌ప‌డాల్సి ఉంటుంది. అయితే, ఆర్సీబీ, ఢిల్లీ రెండు జట్లూ ప్లేఆఫ్‌కు చేరుకోవడం అంత సులువు సాగేప‌నిమాత్రం కాదు.

క్యాచులు వ‌దిలి మ్యాచ్ ను చేజార్చుకున్న ఢిల్లీ..

Latest Videos

undefined

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా రిషబ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో పేలవమైన ఫీల్డింగ్ కార‌ణంగా ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకుంది. దీని భారాన్ని ఓటమి రూపంలో భరించాల్సి వచ్చింది. ఢిల్లీ ఫీల్డర్లు 4 క్యాచ్‌లను మిస్ చేశారు. తొమ్మిదో ఓవర్ మూడో బంతికి విల్ జాక్స్ కు లైఫ్ ల‌భించింది. కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి అక్షర్ పటేల్ క్యాచ్ వదిలాడు. అదే ఓవర్‌లో షాయ్ హోప్ లాంగ్ ఆన్ వద్ద రజత్ పటీదార్ క్యాచ్ ను మిస్ చేశాడు. 10వ ఓవర్ నాలుగో బంతికి విల్ కు మళ్లీ లైఫ్ లభించింది. ఖలీల్ అహ్మద్ వేసిన బంతికి ట్రిస్టన్ స్టబ్స్ తన క్యాచ్‌ను వదులుకున్నాడు. 11వ ఓవర్ తొలి బంతికే పాటిదార్‌కు మళ్లీ లైఫ్ ల‌భించింది. రసిఖ్ సలామ్ వేసిన బంతికి అక్షర్ పటేల్ తన క్యాచ్‌ను వదిలేశాడు. రజత్ పాటిదార్ 32 బంతుల్లో 52 పరుగులు, విల్ జాక్వెస్ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు.

కోహ్లీ మ‌రోసారి.. 

ఆర్సీబీకి విరాట్ కోహ్లీ వేగంగా శుభారంభం అందించాడు. ఫాఫ్ డుప్లెసిస్‌ను అవుట్ చేసిన తర్వాత అతను వేగంగా బ్యాటింగ్ చేశాడు. 7 బంతుల్లో ఆరు పరుగులు చేసి డుప్లెసిస్ ఔటయ్యాడు. ముఖేష్ కుమార్ వేసిన బంతికి జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ క్యాచ్ ఇచ్చాడు. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్‌లోనే కోహ్లి సిక్సర్ బాదాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌లో ముఖేష్‌ వేసిన బంతికి సిక్సర్‌ బాదాడు. ఇషాంత్ వేసిన నాలుగో ఓవర్లో విరాట్ ఒక ఫోర్, సిక్సర్ బాదాడు. ఆ త‌ర్వాత వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ చేతికి క్యాచ్ రూపంలో చిక్కాడు. విరాట్ 13 బంతుల్లో 27 పరుగుల ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 3 సిక్సర్లు బాదాడు.

ఢిల్లీ టాప్ ఆర్డర్ విఫలం.. 

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫ‌ల‌మైంది.  4 ఓవర్లలో 4 వికెట్లు పడిపోయాయి. డేవిడ్ వార్నర్ 2 బంతుల్లో 1 పరుగు చేశాడు. స్వప్నిల్ సింగ్ వేసిన బంతికి విల్ జాక్వెస్ క్యాచ్ పట్టాడు. అతని తర్వాత అభిషేక్ పోరెల్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి ఔటయ్యాడు. యశ్ దయాళ్ వేసిన బంతికి లాకీ ఫెర్గూసన్ క్యాచ్ పట్టాడు. సూప‌ర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. 8 బంతుల్లో 21 పరుగులు చేశాడు. కుమార్ కుశాగ్రాకు మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు. అయితే, తాత్కాలిక కెప్టెన్ అక్షర్ పటేల్ అర్ధ సెంచరీతో ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ పరువు కాపాడాడు. షాయ్ హోప్‌తో కలిసి ఐదో వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. హోప్ 23 బంతుల్లో 29 పరుగులు, అక్షర్ పటేల్ 39 బంతుల్లో 57 పరుగులు చేశారు.

click me!