
బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. అత్యధిక టీఆర్పీ రాబట్టింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ చౌదరి రన్నర్ తో సరిపెట్టుకున్నాడు. కాగా ఫైనల్ లో ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమర్ దీప్ చౌదరి హీరో రవితేజ డై హార్డ్ ఫ్యాన్. ఆయనంటే చచ్చేంత ఇష్టం అని పలుమార్లు చెప్పాడు. బిగ్ బాస్ హౌస్లో కూడా తాను రవితేజ అభిమాని అన్న విషయాని బయటపెట్టాడు.
రవితేజ బాడీ లాంగ్వేజ్ ని అమర్ దీప్ ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు. కాగా ఫైనల్ రోజు రవితేజ షోకి గెస్ట్ గా వచ్చాడు. హోస్ట్ నాగార్జున అమర్ దీప్ కి ఒక పరీక్ష పెట్టాడు. నువ్వు టైటిల్ రేసు నుండి తప్పుకుంటే రవితేజ మూవీలో నటించే ఛాన్స్ ఉంది అన్నాడు. క్షణం ఆలోచించకుండా అమర్ దీప్ హౌస్ నుండి బయటకు వచ్చేందుకు సిద్ద పడ్డాడు. దాంతో ఫిదా అయిన నాగార్జున... నువ్వు టైటిల్ రేసులో ఉన్నావు. అలాగే నీకు రవితేజ మూవీలో ఛాన్స్ ఉందని చెప్పాడు.
దానికి అమర్ దీప్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. రవితేజ తన మాట నిలబెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. రవితేజ నెక్స్ట్ మూవీలో అమర్ దీప్ చౌదరికి ఛాన్స్ వచ్చింది. అమర్ దీప్-రవితేజ కలిసి ఫోటో దిగారు. ఈ క్రమంలో రవితేజ మూవీలో అమర్ దీప్ చౌదరి నటిస్తున్నాడని క్లారిటీ వచ్చింది.